జియో, ఎయిర్‌టెల్‌కి సవాల్, ఐడియా,వొడాఫోన్ విలీనం మరో అడుగు ముందుకు !

By Hazarath
|

దేశీయ రంగంలో పెను విప్లవాలు చోటు చేసుకోబోతున్నాయి. టెలికాం కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా వొడాఫోన్ -ఐడియా మెగా విలీనానికి మరో కీలక ముందడుగు పడింది. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపిందని ఐడియా సెల్యులార్ తెలిపింది. ఇక ఫైనల్‌గా రెండు కంపెనీలకు టెలికామ్ విభాగం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. ఆ అ తర్వాత ఈ డీల్‌ అమల్లోకి వస్తుంది.

 

ఎయిర్‌టెల్ మరో కానుక, ఏడాది పాటు Amazon Prime Membership ఉచితంఎయిర్‌టెల్ మరో కానుక, ఏడాది పాటు Amazon Prime Membership ఉచితం

గత ఏడాది మార్చిలో..

గత ఏడాది మార్చిలో..

కాగా దేశీయ టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్‌ నుంచి వచ్చిన పోటీలను తట్టుకునేందుకు ఈ మెగాడీల్‌కు పునాది పడిందని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూపు, ఐడియా సెల్యులార్‌తో విలీనం కాబోతున్నట్టు వెల్లడించాయి.

23 బిలియన్ డాలర్ల విలువ..

23 బిలియన్ డాలర్ల విలువ..

23 బిలియన్ డాలర్ల విలువైన, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ అతిపెద్ద విలీనానికి ఇరు సంస్థలు అంగీకరించాయి. అటు అక్టోబర్‌లో ఐడియా వాటాదారులు వొడాఫోన్‌తో విలీనానికి ఆమోదం తెలిపారు.

 ఏడాది జూన్‌ నాటికి ఈ పక్రియ పూర్తి..
 

ఏడాది జూన్‌ నాటికి ఈ పక్రియ పూర్తి..

ఇప్పటికే మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నుంచి ఈ మెర్జ్‌కి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. కాగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (డాట్‌) ఇచ్చే తుది ఆమోదంతో ఏడాది జూన్‌ నాటికి ఈ పక్రియ పూర్తి చేయాలని రెండు కంపెనీలు యోచిస్తున్నాయి.

వొడాఫోన్ 45.1 శాతం

వొడాఫోన్ 45.1 శాతం

ఈ ఉమ్మడి సంస్థలో బ్రిటిష్ కంపెనీ వొడాఫోన్ 45.1 శాతం వాటా, ఐడియా పేరెంట్‌ సం‍స్థ ఆదిత్య బిర్లా గ్రూపు 26 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 28.9 శాతం ఇతర వాటాదారుల సొంతం.

 నంబర్ 2 , 3 స్థానాల్లో..

నంబర్ 2 , 3 స్థానాల్లో..

ప్రస్తుతం భారతదేశంలో నంబర్ 2 , 3 స్థానాల్లో కొనసాగుతున్న వొడాఫోన్ ఇండియా, ఐడియాల జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఆవిష్కారంతో ప్రపంచ రెండవ అతిపెద్ద టెలికాం భారతి ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీగా నిలుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.

Best Mobiles in India

English summary
NCLT approves Vodafone-Idea merger: Here’s all you need to know about the deal more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X