15 ఏళ్ల Airtel సామ్రాజ్యం కుప్పకూలింది

|

దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనం తరువాత నెం.1 స్థానం నుంచి ఎయిర్‌టెల్‌ కిందికి పడిపోయింది. ఈ మెర్జ్ ద్వారా దాదాపు 15ఏళ్లపాటు ధరిస్తూ వస్తున్న మార్కెట్‌ లీడర్‌ కిరీటాన్ని, నెం.1 స్థానాన్ని కోల్పోయింది. వొడాఫోన్‌, ఐడియా మెగా మెర్జర్‌లో కీలకమైన ఆఖరి అంకమైన ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కూడా లభించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మెర్జర్‌ తరువాత ఆవిష‍్కరించిన కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌ నంబర్ వన్ స్థానంలోకి దూసుకు వచ్చింది.

దిగ్గజాలకు వొడాఫోన్ కొత్త ట్విస్ట్, పరతులతో కొత్త ఆఫర్ వచ్చింది

 6 లక్షల మంది కొత్త కస్టమర్లను ..
 

6 లక్షల మంది కొత్త కస్టమర్లను ..

దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థ వొడాఫోన్ జూలైలో రికార్డు సృష్టించింది. ఆ నెలలో ఏకంగా 6 లక్షల మంది కొత్త కస్టమర్లను ఖాతాదారులుగా చేర్చుకుంది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఈ స్థాయిలో కొత్త కస్టమర్లు రావడమనేది ఇదే అత్యధికం.

భారతీ ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్

మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్ 3.13 లక్షల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. ఐడియా మాత్రం కేవలం 5,489 మంది ఖాతాదారులను మాత్రమే చేర్చుకుంది.

రెండింటి మధ్య తేడా..

రెండింటి మధ్య తేడా..

జూలైలో వొడాఫోన్ ఇండియా 609,054 మందిని ఖాతాదారులుగా చేర్చుకోగా, భారతీ ఎయిర్‌టెల్ 313,284 మందిని చేర్చుకున్నట్టు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది.

జూలైలో వొడాఫోన్ ఇండియా 609,054 మందిని ఖాతాదారులుగా చేర్చుకోగా, భారతీ ఎయిర్‌టెల్ 313,284 మందిని చేర్చుకున్నట్టు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది.

మొత్తం వొడాఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య..

మొత్తం వొడాఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య..

కొత్త వినియోగదారుల చేరికతో మొత్తం వొడాఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1004.08 మిలియన్లకు చేరుకోగా, సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భారతీ ఎయిర్‌టెల్ మొత్తం ఖాతాదారుల సంఖ్య 344.88 మిలియన్లకు చేరుకుంది.

రిలయన్స్ జియో
 

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 215,255,701 నమోదైంది. వొడాఫోన్ 32.2 శాతం వాటా, 408 మిలియన్ల వినియోగదారులతో ఇప్పుడు దేశంలో అగ్రగామి సంస్థగా నిలిచింది.

 కుమార్ మంగళం ..

కుమార్ మంగళం ..

ఈ మెర్జ్ తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు చేస్తారు. కొత్త సంస్థకు సీఈవోగా బాలెష్ శర్మ నియామకం జరుగుతుందని ఇరు సంస్థలు ఒక అధికారిక ప్రకటనలో తెలిపాయి.

దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా 15,000 దుకాణాలను, 1.7 మిలియన్ల రిటైల్ టచ్‌ పాయింట్లు పంపిణీ వోడాఫోన్‌ ఐడియా సొంతమయింది. దేశంలో అతిపెద్ద సంస్థగా అవతరించి చరిత్ర సృష్టించామని విలీన సంస్థ చైర్మన్‌ కుమార మంగళం వ్యాఖ్యానించారు.

ఐడియా

ఐడియా

ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ పదవినుంచి హిమాంశు కపానియా ఆగస్టు 31, 2018న వైదొలగనున్నారు. ఆయన తొలగిపోయినప్పటికీ కొత్త కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Idea-Vodafone say merger complete, now India's largest telco with 408 million active users more news at Telugu Gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X