Home
News

జాగ్రత్త : ఫోన్ రిపేర్‌కి ఇస్తే రూ.91వేలు కొట్టేశారు

రిపేర్‌ కోసం ఫోన్‌ని సర్వీస్ సెంటర్ కి ఇస్తే అందులోని పేటీఎం ఖాతాలోంచి భారీ మొత్తంలో కొట్టేసారు . కంగుతిన్న బాధితుడు సర్వీస్ సెంటర్ సిబ్బంది పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

మీ ఫోన్ రిపేర్‌కి ఇచ్చే ముందు వ్యాలెట్ యాప్స్ అన్‍ఇన్‌స్టాల్ చేయండి. లేదా పాస్‌వర్డ్ సెట్ చేసి పెట్టుకోండి లేకపోతే అందులో డబ్బులు మాయం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీ లో చోటు చేసుకుంది. రిపేర్‌ కోసం ఫోన్‌ని సర్వీస్ సెంటర్ కి ఇస్తే అందులోని పేటీఎం ఖాతాలోంచి భారీ మొత్తంలో కొట్టేసారు . కంగుతిన్న బాధితుడు సర్వీస్ సెంటర్ సిబ్బంది పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే....

యూసుఫ్ కరీం మొబైల్ ఫోన్ పాడైంది....

యూసుఫ్ కరీం మొబైల్ ఫోన్ పాడైంది....

ఢిల్లీలోని కల్కాజీకి చెందిన 28 ఏళ్ల యూసుఫ్ కరీం మొబైల్ ఫోన్ పాడైంది. దీంతో అతను రిపేర్ కోసం సర్వీస్ సెంటర్‌లో ఇచ్చాడు. అక్కడి సిబ్బంది ఫోన్ రిపేర్ చేసి తిరిగిచ్చారు.

ఇ-మెయిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్....

ఇ-మెయిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్....

ఇంటికెళ్లాక కరీం తన ఇ-మెయిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్. అందులో పేటీఎం నుంచి వరుసగా మెయిల్స్ ఉన్నాయి. అతడి పేటీఎం అకౌంట్ నుంచి రూ.91,000 వేర్వేరు అకౌంట్లల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు కనిపించింది.

షాకైన కరీం వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు....

షాకైన కరీం వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు....

పేటీఎం ఇ-మెయిల్స్ చూసి షాకైన కరీం వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాను రిపేర్ కోసం ఫోన్‌ని సర్వీస్ సెంటర్‌లో ఇచ్చానని, తన పేటీఎం అకౌంట్‌లోకి ఎవరో లాగిన్ అయి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని కంప్లైంట్ ఇచ్చాడు.

పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిశాయి....

పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిశాయి....

రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిశాయి. కరీం పేటీఎంలో డబ్బులు కొట్టేయడమే కాదు అతని రిజిస్టర్డ్ ఇ-మెయిల్ అడ్రస్ కూడా మార్చేసి రూ.19,999 ట్రాన్స్‌ఫర్ చేశారని తేలింది. అంతకుముందు ఏడు ట్రాన్సాక్షన్స్‌లో రూ.80,498 విత్‌డ్రా చేసుకున్నారు.

సర్వీస్‌ సెంటర్‌లో ఉన్న ఇంజనీర్లే తన పేటీఎం నుంచి డబ్బులు....

సర్వీస్‌ సెంటర్‌లో ఉన్న ఇంజనీర్లే తన పేటీఎం నుంచి డబ్బులు....

సర్వీస్‌ సెంటర్‌లో ఉన్న ఇంజనీర్లే తన పేటీఎం నుంచి డబ్బులు కొట్టేశారన్నది బాధితుడి ఆరోపణ. అంతేకాదు తాను ఎన్ని రిక్వెస్ట్‌లు పెట్టినా పేటీఎం తన అకౌంట్ బ్లాక్ చేయలేదంటున్నాడు.అయితే ఈ వ్యవహారంపై పేటీఎం స్పందించాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nearly Rs 91,000 withdrawn from man's mobile wallet by 'service centre staff'.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X