ప‌బ్‌జిపై నిషేధం ఎత్తివేత, ఎక్కడో తెలుసా ?

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవర్ని కదిపినా మోస్ట్ పాపులర్ గేమ్ ఏదైనా చెప్పమంటే అది ప‌బ్‌జినే అని చెబుతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ దానికి బానిసగా మారిపోయారు. దీంతో ఈ గేమ్ ఈ మధ్య కాలంలో తీవ్ర ప్

|

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవర్ని కదిపినా మోస్ట్ పాపులర్ గేమ్ ఏదైనా చెప్పమంటే అది ప‌బ్‌జినే అని చెబుతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ దానికి బానిసగా మారిపోయారు. దీంతో ఈ గేమ్ ఈ మధ్య కాలంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటోంది. కొన్ని దేశాల్లో బ్యాన్ చేయాలనే నినాదం కూడా ఊపందుకుంది.

ప‌బ్‌జిపై నిషేధం ఎత్తివేత, ఎక్కడో తెలుసా ?

చాలా దేశాలు పబ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు బ్యాన్ కూడా చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈ గేమ్ పై నీలి నీడలు కొంచెం కొంచెంగా తొలగిపోతున్నాయి. వార్త పూర్తి వివరాల్లోకెళితే..

నిషేధాన్ని ఎత్తివేస్తూ..

నిషేధాన్ని ఎత్తివేస్తూ..

నేపాల్‌లో గ‌త కొద్ది రోజుల కింద‌ట అక్క‌డి ప్ర‌భుత్వం ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధం విధించిన విష‌యం విదిత‌మే. కాగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ అక్క‌డి సుప్రీం కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

మొబైల్ గేమ్‌ను నిషేధించాల‌ని...

మొబైల్ గేమ్‌ను నిషేధించాల‌ని...

నేపాల్‌లోని ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ సూచ‌న‌ల మేర‌కు నేపాల్ టెలీ క‌మ్యూనికేష‌న్స్ అథారిటీ (ఎన్‌టీఏ) ఈ నెల 11వ తేదీన ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను నిషేధించాల‌ని ఆ దేశంలోని ఐఎస్‌పీఎస్‌, మొబైల్ ప్రొవైడ‌ర్లు, నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఆదేశించింది.

ఒక గేమ్ మాత్రమే.
 

ఒక గేమ్ మాత్రమే.

అయితే ఈ నిషేధాన్ని ఆ దేశ సుప్రీం కోర్టు ఎత్తేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వర్ ప్రసాద్ ఖతివాడా ఈమేరకు తీర్పును వెలువరించారు. ‘పబ్‌జి మొబైల్ అనేది ఒక గేమ్ మాత్రమే. దీన్ని వినోద మధ్యమంగా చూడాలి' అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అలాగే పబ్‌జి మొబైల్ బ్యాన్‌ చేస్తూ ఖాట్మాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌పై స్టే విధించింది.

భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ

భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ

నేపాల్ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ ఖ‌తివాడా ప‌బ్‌జి మొబైల్ గేమ్ నిషేధం ఎత్తివేతపై మాట్లాడుతూ.. ప‌బ్‌జి మొబైల్ గేమ్ అన్న‌ది ఒక గేమ్ మాత్ర‌మేన‌ని, దాన్ని వినోద మాధ్య‌మంగానే చూడాల‌ని, ప్ర‌జ‌లు వినోదం కోస‌మే ఈ గేమ్‌ను ఆడుతున్నార‌ని, భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ అన్న‌ది రాజ్యాంగం అంద‌రికీ క‌ల్పించిన హ‌క్క‌ని, గేమ్‌పై నిషేధం విధిస్తే.. ఎందుకు నిషేధం విధించారో స‌రైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, అందుకు ఆమోద‌యోగ్య‌మైన కార‌ణం తెల‌పాల‌ని అన్నారు.

నేపాల్ లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై

నేపాల్ లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై

ఈ క్ర‌మంలోనే పబ్‌జి మొబైల్ బ్యాన్‌ చేస్తూ ఖాట్మాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నెల 10వ తేదీన ఖాట్మాండ్ కోర్టు విధించిన నిషేధం ఆమోదయోగ్యంగాలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు నేపాల్ లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై ఎలాంటి నిషేధం లేద‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

పబ్‌జి గేమ్ వల్ల ప్రతికూల ప్రభావం

పబ్‌జి గేమ్ వల్ల ప్రతికూల ప్రభావం

పబ్‌జి గేమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పిల్లలపై పబ్‌జి గేమ్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతోందని కొందరు చెబుతుంటే.. పిల్లలు పబ్‌జి గేమ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారని, పబ్‌జి ఆడటం వల్ల వీళ్లలో హింసాత్మక ప్రవర్తన పెరుగుతోందని మరికొందరు పేర్కొంటున్నారు.

Best Mobiles in India

English summary
nepals supreme court orders the government not to ban pubg mobile

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X