ఇంటర్నెట్‌ను కాపాడుకుందాం రండి

Posted By:

గత కొద్ది రోజులుగా 'నెట్ న్యూట్రాలిటీ' అనే అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్నెట్ లోని అన్ని వైబ్ సైట్లను అందరూ ఒకే రీతిలో యాక్సెస్ చేసుకునే విధంగా టెలికామ్ ఆపరేటర్లు తటస్థ వైఖరితో పక్షపాతరహితంగా వ్యవహరించాలని లక్షల మంది నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 'సేవ్ ఇంటర్నెట్' పేరుతో పొదునెక్కిన ఈ ఉద్యమం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)నిు పునరాలోచనలో పడేసింది.

ఇంటర్నెట్‌ను కాపాడుకుందాం రండి

నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి..?

ఇంటర్నెట్‌ లోని మొత్తం ట్రాఫిక్ ను పక్షపాతరహితంగా అందరికి అందుబాటులో ఉంచాలన్నది 'నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన సిద్ధాంతం. టెలికామ్ కంపనీలు ఈ సిద్ధాంతాన్ని అనుసరించటం వల్ల ఫ్లిప్ కార్ట్ లో ఆన్ లైన్ షాపింగ్ మొదలుకుని యూట్యూబ్ లో వీడియో వీక్షణ వరకు అంతా ఒకే స్పీడుతో ఒకే రకంగా ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో పలు టెలికం ఆపరేటర్లు కొత్త ప్యాకేజీల పేరుతో వినియోదారులు ఇంటర్నెట్ వినియోగ సరళిని నియత్రించే ప్రయత్నం చేయడంతో 'నెట్ న్యూట్రాలిటీ' అంశం తెర మీదకు వచ్చింది.

వివాదానికి దారి తీసిన అంశాలు:

వాట్సాప్, స్కైప్ వంటి ఓవర్ ద టాప్ (ఓటీటీ) సర్వీసుల పై అదనంగా రుసుము విధాంచాలన్న ప్రతిపాదనను తీసుకురావటం, కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదర్చుకుని కొన్ని వెబ్‌సైట్‌లను ఉచితంగా అందించే యోచన చేయటం వంటి ప్రయత్నాలు చేస్తున్న టెలికామ్ ఆపరేటర్ల పై నెటిజనులు మండిపడుతున్నారు. నెట్ న్యూట్రాలటీ అమలులో లేనుందనే ఇలా జరగుతోందని.. ఈ విధాన్ని అడ్డుకోవాలని లక్షల మంది డిమాండ్ చేస్తున్నారు.

నెట్ న్యూట్రాలిటీని పాటించకపోవటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని గడించే సంస్థలు భారీగా డబ్బు వెచ్చించి టెలికామ్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలవు, అలా కుదర్చుకోలేని చిన్నచిన్న వెబ్‌సైట్‌లు పోటీలో వెనుకబడిపాతాయి. ఉచిత సర్వీసులతో సరిపెట్టుకునే వారు ఇతర డేటా ప్యాకేజీలను కొనుగోలు చేయలేకపోవటంతో చిన్న‌చిన్న వెబ్‌సైట్‌లకు నష్టం వాటిల్లక తప్పదు. ఇంటర్నెట్ విషయంలో టెల్కోలు ఈ విధంగా వ్యవహరించడం వల్ల చిన్న చిన్న సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని క్రేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్ సోమవారం వెల్లడించారు.

#SaveTheInternet ప్రచారంలో మీర కూడా పాల్గొనాలనుకుంటున్నారా..?

నెట్ న్యూట్రాలటీ కోసం సాగుతున్న పోరాటంలో మీరు కూడా చేయికలపాలనుకుంటున్నారా..? అయితే గిజ్‌బాట్ సేవ్ ద ఇంటర్నెట్ పిటీషన్ పేజీలోకి వెళ్లండి. అక్కడ మీ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. నెట్ నూట్రాలిటీని కోరుకుంటున్నట్లు మీ తరుపున ఒక ఈ-మెయిల్ ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు పంపిస్తాం. సబ్మిషన్ కు ఆఖరి తేదీ శుక్రవారం, ఏప్రిల్ 24. ఇదే సమయంలో మీ స్పందనను advqos@trai.gov.inకు కూడా తెలియజేయవచ్చు.

గిజ్‌బాట్ సేవ్ ద ఇంటర్నెట్ పిటీషన్ పేజీలోకీ వెళ్లేందుకు క్లిక్ చేయండి.

English summary
Net Neutrality: What You Need To Know and Why You Should Support. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting