Netflix లో కొత్త మార్పులు!! పరీక్ష దశలో 'పాస్‌వర్డ్ వెరిఫికేషన్స్ సిస్టమ్'...
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు వినోదం కోసం ప్రముఖ గ్లోబల్ ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్తగా లాగిన్ ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతానికి ఇది ఎంచుకున్న కొంత మంది వినియోగదారుల మీద పరీక్ష దశలో ఉంది. చాలా మంది వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను ఇతర వ్యక్తులతో పంచుకుంటారు. అలాగే వారు దాన్ని అకౌంట్ యజమానికి తెలియకుండానే మరికొంత ఎక్కువ మంది వ్యక్తులతో పంచుకుంటారు. ఇది నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ కోల్పోవడానికి దారి తీస్తుంది. ఈ కొత్త సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్న లాగిన్ ధృవీకరణ వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ వెరిఫికేషన్స్ సిస్టమ్
నెట్‌ఫ్లిక్స్ అకౌంటు యొక్క యజమాని అకౌంట్ మరియు పాస్‌వర్డ్ వివరాలతో మరొకరు లాగిన్ ప్రాసెస్ ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరొక డివైస్ లో అకౌంట్ తో లాగిన్ అవ్వవచ్చో లేదో వంటి వివరాలు అకౌంట్ యజమానికి టెక్స్ట్ లేదా ఇమెయిల్ ద్వారా పంపబడతాయి. ఈ ప్రక్రియను యాక్సిస్ చేయడానికి అవసరమైన వివరాలను వ్యక్తి నమోదు చేసినప్పుడు మాత్రమే అతను / ఆమె అకౌంటులోకి లాగిన్ అవుతారు. ఇది యూజర్ల నెట్‌ఫ్లిక్స్ అకౌంటులోకి లాగిన్ అవ్వడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవడానికి అకౌంట్ యజమానిని అనుమతిస్తుంది. ఇంకా ఇది ఇతరుల నెట్‌ఫ్లిక్స్ అకౌంటును ఉపయోగిస్తున్న వ్యక్తులను వారి స్వంతదానిని పొందడానికి ప్రేరేపిస్తుంది.

పాస్‌వర్డ్ వెరిఫికేషన్స్ సిస్టమ్ ను అమలు చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నది. అయితే డిస్నీ + హాట్‌స్టార్ ఇప్పటికే OTP వ్యవస్థను అమలు చేయడం గమనించదగిన విషయం. నెట్‌ఫ్లిక్స్ సర్వీస్ నిబంధనలలో అకౌంట్ యజమాని యొక్క వివరాలు ఇంటి వెలుపల ఉన్న వ్యక్తులతో పంచుకోవద్దని చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ క్రొత్త పాస్‌వర్డ్ వెరిఫికేషన్స్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి రానున్నదాని మీద ఇంకా సరైన సమాధానం లేదు.

నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు తన ‘మొబైల్ +' ప్లాన్ ను భారతదేశంలో కూడా పరీక్షిస్తోంది. దేశంలోని వినియోగదారుల కోసం ఈ ప్లాన్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ప్లాన్ నెలకు రూ.299 ధర వద్ద లభిస్తుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు మరియు కంప్యూటర్‌లలో ‘హెచ్‌డి' నాణ్యతతో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రీమియం ప్లాన్‌ను నెలకు రూ.799 ధర వద్ద కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే 4K + HDR కంటెంట్ క్వాలిటీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది నెట్‌ఫ్లిక్స్ కోసం ప్లాన్ యొక్క ‘టెస్టింగ్' కాలం మాత్రమే. అలాగే ఈ ప్లాన్ యొక్క గొప్ప ప్రతిస్పందనను చూస్తే కనుక స్ట్రీమింగ్ దిగ్గజం దానిని దీర్ఘకాలికంగా విడుదల చేస్తుంది. అయితే ప్రతిస్పందన అంత గొప్పగా లేకపోతే కనుక ఈ ప్లాన్ రద్దు చేయబడుతుంది అని సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








