iOS యూజర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ఎంపికను తీసుకువచ్చింది...

|

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో అందరూ కూడా కాలానికి తగ్గట్టుగా అప్‌డేట్‌ అవుతున్నారు. కొత్త అప్‌డేట్‌లో భాగంగా వినోదం కోసం అధిక మంది OTT యాప్ లను ఎంచుకుంటున్నారు. OTT యాప్‌లలో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడా విడుదల కావడంతో ప్రతి ఒక్కరు వాటి యొక్క సబ్స్క్రిప్షన్ ని పొందుతున్నారు. ఇటువంటి OTT యాప్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ మరియు ios యూజర్లకు కూడా అందుబాటులో ఉంది. ఇది ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే వస్తోంది. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ యొక్క iOS యాప్ కోసం ఒక కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ యొక్క iOS యాప్ కోసం కొత్తగా ఏక్సటర్నల్ సబ్‌స్క్రిప్షన్ బటన్‌ను జోడిస్తుంది. ఇది వినియోగదారులను వారి సబ్‌స్క్రిప్షన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కి నేరుగా దారిని మళ్లిస్తుంది. యాప్ స్టోర్ ద్వారా యాప్‌లో లావాదేవీలపై 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తూ ఆపిల్ వార్తల్లో నిలిచింది. చివరికి నెట్‌ఫ్లిక్స్ మరియు స్పాటిఫై వంటి కంపెనీలను యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ బటన్‌ను తొలగించేలా చేసింది. కొత్త అప్‌డేట్‌ ముందుకు రావడంతో iOSలోని నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో 'సైన్ ఇన్' బటన్ మాత్రమే ఉంది. అయితే కొత్త వినియోగదారులు యాప్ ద్వారా లాగిన్ చేయడానికి ప్రయత్నించే ముందు సబ్‌స్క్రిప్షన్‌ను ఏక్సటర్నల్(బయట) మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Netflix లో కిడ్స్ కోసం కొత్త మిస్టరీ బాక్స్ ఫీచర్స్!!Netflix లో కిడ్స్ కోసం కొత్త మిస్టరీ బాక్స్ ఫీచర్స్!!

నెట్‌ఫ్లిక్స్ యాప్‌

iOSలోని నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఇప్పుడు వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ బటన్‌ను నొక్కినప్పుడు ప్రాంప్ట్‌ను ప్రదర్శిస్తుంది. అంటే లావాదేవీకి ఆపిల్ సంస్థ బాధ్యత వహించదని వారికి తెలియజేస్తుంది. తరువాత ముందుకు 'కొనసాగించు' ఎంపికని నొక్కడం ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన వెబ్ బ్రౌజర్ ద్వారా నేరుగా నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కి మళ్ళించబడతారు. ఈ విధంగా నెట్‌ఫ్లిక్స్ ప్రతి సబ్‌స్క్రిప్షన్ కోసం ఆపిల్ కి అందించే 30 శాతం కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఒక సంవత్సరం తర్వాత సబ్‌స్క్రిప్షన్ ని అప్ డేట్ చేయడం కోసం ఈ కమీషన్ 15 శాతానికి తగ్గించబడింది. ఈ విధంగా మీరు పొందాలనుకునే నెట్‌ఫ్లిక్స్ యొక్క సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియను మరింత సులభంగా పూర్తి చేయవచ్చు.

Netflix లో కొత్తగా 'టూ థంబ్స్ అప్' బటన్‌ ఫీచర్!! ఉపయోగం ఏమిటోNetflix లో కొత్తగా 'టూ థంబ్స్ అప్' బటన్‌ ఫీచర్!! ఉపయోగం ఏమిటో

యాంటీట్రస్ట్

గత ఏడాది జపాన్‌కు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆపిల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరియు ఇతర కంపెనీలను తమ వెబ్‌సైట్‌లను లింక్ చేయకుండా అనుమతించవలసి వచ్చింది. మ్యూజిక్, వీడియోస్, ఈబుక్‌లు మరియు మరిన్నింటిని కలిగి ఉండే 'రీడర్ యాప్‌లు' అని కూడా ఎక్సటర్నల్ లింక్‌లతో అనుమతించడానికి ఇది దాని యాప్ స్టోర్ నియమాలను సడలించవలసి వచ్చింది. కుపెర్టినో కంపెనీ ఇప్పటికీ రీడర్ యాప్‌గా అప్లికేషన్‌ను క్వాలిఫై చేసే ప్రమాణాలపై నియంత్రణను కలిగి ఉంది.

మొబైల్ పేమెంట్ ఎంపిక

యాప్ స్టోర్ ద్వారా యాప్‌లో కొనుగోళ్లను డైరెక్ట్ చేసే ఆపిల్ సంస్థ యొక్క విధానం ఇటీవలి సంవత్సరాలలో గ్లోబల్ పరిశీలనలో ఉంది. EU రెగ్యులేటర్లు కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని మరియు థర్డ్-పార్టీ మొబైల్ వాలెట్‌లకు యాక్సెస్‌ను అన్యాయంగా పరిమితం చేసిందని ఆరోపించారు. కంపెనీ తన మొబైల్ పేమెంట్ ఎంపికలను ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే డిజిటల్ కంటెంట్ కోసం పేమెంట్లకు సంబంధించి యాంటి-కాంపిటీటివ్ పద్ధతులను ఉపయోగించినందుకు ఆపిల్ భారతదేశంలో కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధిత వార్తలలో కుపెర్టినో కంపెనీ నెదర్లాండ్స్‌లోని డేటింగ్ యాప్‌లకు ఆపిల్ యొక్క యాప్‌లో పేమెంట్ వ్యవస్థను దాటవేసే ఎంపికను అందించింది. డెవలపర్‌లు బాహ్యంగా చేసిన చెల్లింపులపై కమీషన్‌లు తక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Netflix Introduced External Subscription New Option For iOS Users: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X