Just In
- 8 hrs ago
Flipkart లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!
- 8 hrs ago
CIBIL స్కోర్‌ను ఆన్లైన్లో తనిఖీ చేయడం ఎలా?
- 9 hrs ago
Xiaomi ఇండియా లో లాంచ్ చేసిన రోబోట్ డాగ్ ఇదే ! మీరు కూడా కొనొచ్చు ...ఎందుకు ?
- 12 hrs ago
iQOO 10, 10 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది!! ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి...
Don't Miss
- Sports
టీ20 ప్రపంచకప్‌కు మా ప్లాన్లలో ఉమ్రాన్ మాలిక్ కచ్చితంగా ఉంటాడు : రోహిత్ శర్మ
- News
కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు శాఖల బాధ్యతలు
- Movies
విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు కేంద్రం కీలక పదవులు.. నేరుగా రాజ్యసభకు!
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Finance
Anand Mahindra: అదిరిపోయిన ఆనంద్ మహీంద్రా రిప్లై.. HRI అంటూ సమాధానం..
- Lifestyle
Happy Eid al-Adha 2022 : బక్రీద్ సందర్భంగా మీ ముస్లిం మిత్రులకు ఈ విషయం చెప్పడం మర్చిపోకండి...!
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Netflix లో కిడ్స్ కోసం కొత్త మిస్టరీ బాక్స్ ఫీచర్స్!!
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చాలా మంది ప్రస్తుత రోజులలో OTTల మీద ఆధారపడుతున్నారు. ఈ OTT లలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్, టీవీ వంటి యాక్సిస్ లతో లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీవీ యూజర్ల కోసం కొత్తగా కిడ్స్ మిస్టరీ బాక్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో బాస్ బేబీ: బ్యాక్ ఇన్ ది క్రిబ్, గాబీస్ డాల్‌హౌస్, బ్యాక్ టు ది అవుట్‌బ్యాక్, క్యాంప్ క్రెటేషియస్ మరియు జురాసిక్ వరల్డ్ వంటి వాటితో సహా పిల్లలకు ఇష్టమైన వెబ్ సిరీస్ మరియు సినిమాలను కనుగొనడానికి ఆహ్లాదకరమైన మరియు సురక్షితమైన స్థలాన్ని అందించనున్నది. అదనంగా గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే (GAAD) సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తన ఆడియో వివరణలు (AD) మరియు డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ (SDH) కోసం సబ్టైటిల్ల లభ్యతను విస్తరించనున్నట్లు కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌ఫ్లిక్స్ కిడ్స్ మిస్టరీ బాక్స్
నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల వయస్సుకి తగిన సినిమాలు మరియు వెబ్ షోలను సులభంగా కనుగొనడానికి అనుమతిస్తుంది. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చిన్న పిల్లల కోసం కొత్తగా కిడ్స్ మిస్టరీ బాక్స్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయడానికి మీరు కింద ఉన్న ఈ సాధారణ దశలను అనుసరించండి.
** ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో పిల్లల ప్రొఫైల్‌కి లాగిన్ చేయండి.
** హోమ్‌పేజీ విభాగం ఎగువన ఉన్న కిడ్స్ 'ఫేవరేట్ రో' ను కనుగొనండి.
** 'న్యూ ఫర్ యు' టైటిల్‌ను కనుగొని 'మిస్టరీ బాక్స్'పై హోవర్ చేయండి.
ఇప్పుడు మీరు కొత్త ఫ్యామిలీకి తగిన సిఫార్సులతో సినిమాలు లేదా షోలను చూస్తారు. ఈ ఫీచర్ మీరు స్క్రోలింగ్ చేయడానికి మరియు ఏమి చూడాలో నిర్ణయించుకునే సమయాన్ని ఆదా చేస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ లాంగ్వేజ్ యాక్సిస్ టూల్స్
నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు కొత్తగా లాంగ్వేజ్ టూల్స్ ని కూడా విస్తరించింది. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ యొక్క అన్ని రకాల షోలు మరియు సినిమాలలో ఆడియో డిస్క్రిప్షన్స్ మరియు సబ్-టైటిల్స్ స్పానిష్, పోర్చుగీస్ మరియు ఫ్రెంచ్‌తో సహా మరో 20 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంటాయి. "SDH మరియు AD లాంగ్వేజ్ లభ్యతను 20కి పైగా భాషలకు పెంచడం ద్వారా మీరు ఎక్కడి నుండి వచ్చినా మీరు ఏ భాష మాట్లాడినా కూడా స్క్రీన్‌పై వారి భాష ప్రతిబింబించేలా చూసే సామర్థ్యాన్ని మా సభ్యులందరికీ అందించాలని మేము ఆశిస్తున్నాము అని కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది.

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ వెబ్ మరియు iOSలో AD మరియు SDH ఉన్న షోలు మరియు ఫిల్మ్‌ల కోసం కొత్త బ్యాడ్జ్‌లను జోడిస్తోంది. తద్వారా ఈ రకమైన కంటెంట్‌ను సులభంగా గుర్తించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ తన మొట్టమొదటి సేకరణను "సెలబ్రేటింగ్ డిసేబిలిటీ విత్ డైమెన్షన్" పేరుతో ప్రారంభించింది. ఇందులో 50 కంటే ఎక్కువ షోలు మరియు సినిమాల యొక్క అన్ని రకాల పాత్రలకు సంబందించిన వ్యక్తుల గురించి డిస్క్రిప్షన్ లను అందజేస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ టూ థంబ్స్ అప్ ఆప్షన్
నెట్‌ఫ్లిక్స్ ప్రకారం టూ థంబ్స్ అప్ ఆప్షన్ "మీ యొక్క సిఫార్సులను చక్కగా తీర్చిదిద్దడానికి ఒక మార్గం." మీకు నచ్చిన మెటీరియల్‌ని హైలైట్ చేయడానికి మీరు ఇప్పటికీ సింగిల్ థంబ్స్ అప్ని ఉపయోగించవచ్చు. అయితే మీరు బదులుగా టూ థంబ్స్ అప్ ఆప్షన్ని ఎంచుకుంటే కనుక దానికి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో మరింత ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. "ఇది మా మొత్తం వ్యూహంలో భాగం మరియు యూజర్ల సిఫార్సులను మెరుగుపరచడానికి, మరింత ఫీడ్‌బ్యాక్ మరియు ఇన్పుట్ ఇవ్వడానికి మాకు వీలు కల్పిస్తుంది" అని సంస్థ యొక్క ఇన్నోవేషన్ ఫర్ పర్సనలైజేషన్ డైరెక్టర్ క్రిస్టీన్ డోయిగ్-కార్డెట్ అన్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మీరు ఇప్పటికే రేట్ చేసిన సినిమాలు మరియు టీవీ షోల యొక్క మీ రేటింగ్లను కూడా సవరించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ రీడిజైన్ చేయబడిన ఇంటర్ఫేస్ వినియోగదారులకు సులభతరం చేయవచ్చని సూచించింది. టూ థంబ్స్ డౌన్ ఆప్షన్ గురించి అడిగినప్పుడు, కంపెనీ అధికారులు ప్రతిస్పందించారు. కొత్త టూ థంబ్స్ అప్ ఎంపిక ఇప్పుడు మీ టీవీ, వెబ్, ఆండ్రాయిడ్ మరియు iOS మొబైల్ పరికరాలలో థంబ్స్ అప్ మరియు థంబ్స్ డౌన్ బటన్ల పక్కన అందుబాటులో ఉంది.

నెట్‌ఫ్లిక్స్ స్కిప్ ఇంట్రో బటన్
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ OTT స్పేస్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. అలాంటి ఒక ఫీచర్ 'స్కిప్ ఇంట్రో' బటన్. నెట్‌ఫ్లిక్స్ అందించే ఈ ఫీచర్ వెనుక ఉన్న కథ గురించిన వివరాలను సంస్థ వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ ను ఉపయోగించే వినియోగదారులు అందరు కూడా ఒక రోజులో 'స్కిప్ ఇంట్రో' బటన్‌ను 136 మిలియన్ సార్లు నొక్కినట్లు పేర్కొంది. ఈ ఫీచర్ సంచిత సమయంలో 195 సంవత్సరాలు ఆదా చేస్తుంది. ఈ ఫీచర్‌ను మొదటగా ఆరేళ్ల క్రితం రూపొందించారు. 10-సెకన్ల ఇంక్రిమెంట్లో స్కిప్ ఫార్వర్డ్ మరియు స్కిప్ బ్యాక్వర్డ్ బటన్లను జోడించాలనే ఆలోచన ఉంది. 10 సెకన్లు స్కిప్ బ్యాక్ ఆఫర్ చేయడానికి కారణం సిరీస్ లేదా సినిమాలోని నిర్దిష్ట క్షణాన్ని మిస్ అయిన వీక్షకుల కోసం. నెట్‌ఫ్లిక్స్ సెర్చ్ తర్వాత 15% మంది సభ్యులు మొదటి ఐదు నిమిషాల్లోనే సిరీస్‌ను మాన్యువల్‌గా ముందుకు తీసుకువెళుతున్నారని తేలింది. వారు 'స్కిప్ ఇంట్రో' బటన్ ఆలోచనను స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇది జరిగింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086