Home
News

అత్యంత తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్

By Gizbot Bureau

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని వినియోగదారులకు శుభవార్త చెప్పింది. చవక ధరకే నెలవారీ ప్లాన్‌ను అందజేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ క్రమంలో నెలకు రూ.250 ధరకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్దమవుతోంది. ప్రస్తుతం అమెజాన్, హాట్‌స్టార్ తదితర వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో చాలా తక్కువ ధరకే నెలవారీ, వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నారు.

Netflix to offer cheaper subscription plan in India

అమెజాన్‌లో నెలకు రూ.129, ఏడాదికి రూ.999 ప్లాన్‌ను అందిస్తుండగా, హాట్‌స్టార్‌లో నెలకు రూ.199, ఏడాదికి రూ.999 ప్లాన్‌లను అందిస్తున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం నెలకు బేసిక్ ప్లానే రూ.500 నుంచి మొదలవుతుంది. బేసిక్ ప్లానే రూ. 500 నుంచి మొదలు కావడంతో తమ స్ట్రీమింగ్ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

 తక్కువ ధరకే నూతనంగా ఓ ప్లాన్‌

తక్కువ ధరకే నూతనంగా ఓ ప్లాన్‌

గత 3 నెలల కాలంలో తాము అనుకున్న దానికన్నా చాలా తక్కువ మంది సబ్‌స్ర్కైబర్లు ఇండియాలో కొత్తగా చేరారని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అందువల్లే తక్కువ ధరకే నూతనంగా ఓ ప్లాన్‌ను కేవలం భారత కస్టమర్లకే త్వరలో అందుబాటులోకి తేనున్నామని ఆ సంస్థ వెల్లడించింది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చవకైన బేసిక్ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి ఇంకా సమాచారం లేదు.

  మొబైల్ ఓన్లీ వీక్లి ప్లాన్‌

మొబైల్ ఓన్లీ వీక్లి ప్లాన్‌

ఇంతకుముందు మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్ సేవలను పొడిగించిన ఈ సంస్థ గతనెలలో మొబైల్ యూజర్ల కోసం మరిన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ఆవిష్కరించింది. మొబైల్ ఓన్లీ వీక్లి ప్లాన్‌ను కేవలం రూ.65కే అందిస్తోంది.

 ప్రస్తుతం నాలుగు ప్లాన్లు

ప్రస్తుతం నాలుగు ప్లాన్లు

నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం నాలుగు ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.65ల మొబైల్ ఓన్లీ ప్లాన్, రూ.125 వీక్లి బేసిక్ ప్లాన్ (ఎస్‌డీ ఓన్లీ), రూ.165 వీక్లి స్టాండర్డ్ ప్లాన్ (రెండు డివైస్‌లకు, హెచ్‌డీ), రూ.200 వీక్లి అల్ట్రా ప్లాన్ (4 డివైస్‌లు, 4కే) అనేవి ఇందులో ఉన్నాయి. కంపెనీ అలాగే రూ.250 మొబైల్ ఓన్లీ మంత్లీ ప్లాన్‌ను కూడా పరీక్షిస్తోంది.

 ఒకేసారి ఒకే స్క్రీన్ మీద

ఒకేసారి ఒకే స్క్రీన్ మీద

మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో ఒకేసారి ఒకే స్క్రీన్ మీద చూడగలం. అది ఫోన్ కావొచ్చు. ట్యాబ్లెట్ కావొచ్చు. హెచ్‌డీ, 4కే కంటెంట్ యాక్సెస్ కూడా ఉండదు. ఆసియా, ఇతర వర్ధమాన మార్కెట్ల లక్ష్యంగా కంపెనీ ఈ చౌక ధర ప్లాన్‌లను ఆవిష్కరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ల వివరాలు తెలుస్తున్నాయి. అయితే అందరి యూజర్లకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉండకపోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Netflix to offer cheaper subscription plan in India: Price of new plan and launch timeline
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X