Home
News

నెట్‌ఫ్లిక్స్‌ ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్ ఫీచర్‌ను వినియోగిస్తున్నారా... అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌..??

నెట్‌ఫ్లి్క్స్‌ తన యాజర్‌లకు సంస్థ షాక్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనేక మంది యూజర్లకు ఎంతో సౌకర్యంగా ఉన్న ఆఫ్‌ లైన్‌ డౌన్‌ లోడ్‌ ఆప్షన్‌ను తొలగించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తోందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా టీవీ షోలు సహా ఇతర వీడియో కంటెంట్‌ ను డౌన్‌లోడ్‌ చేసి ఇంటర్నెట్‌ అందుబాటులో లేని సమయంలో ఈ కంటెంట్‌ను చూసేందుకు అవకాశం ఉండేది. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్‌ విండోస్‌ యాప్‌ (Netflix Offline Download) కోసం త్వరలో అప్‌డేట్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ ఆఫ్‌లైన్‌ వాచింగ్‌ (వీడియో కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసి వీక్షించే అవకాశం) ఫీచర్‌ను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఫీచర్‌ తొలగింపు వార్తలు నిజమైతే విండోస్‌ ఆధారిత కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ను వీక్షించే యూజర్లపై ప్రభావం చూపుతుంది. మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ X లో Artem Russakovskil అనే యూజర్‌ నెట్‌ఫ్లిక్స్‌ విండోస్‌ కొత్త యూప్ గురించి ఓ పోస్టు చేశారు.

Netflix may remove offline download feature in windows app here are the details

ఈ పోస్టు ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌ విండోస్‌ యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వెర్షన్‌ ద్వారా లైవ్‌ ఈవెంట్‌లను ఆస్వాదించవచ్చు. అయితే డౌన్‌లోడ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉండదు. అయితే సపోర్టు చేసిన స్మార్ట్‌ఫోన్‌ లు సహా ఇతర డివైజ్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌ కంటెంట్‌ను వీక్షించవచ్చని పేర్కొన్నారు.

అయితే మరో యాజర్‌ మాత్రం ఆఫ్‌ లైన్‌ డౌన్‌లోడ్‌ ఫీచర్‌ తొలగించే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. విండోస్‌ యాప్‌ నుంచి డౌన్‌ లోడ్‌ ఫీచర్‌ను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలపై నెట్‌ఫ్లిక్స్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఒకవేళ ప్రస్తుతం వస్తున్న వార్తలు నిజమైతే.. దీని వెనుక కొన్ని కారణాలు ఉండే అవకాశం ఉంది.
నెట్‌ఫ్లిక్స్‌ అనేక ప్లాట్‌ఫాంలలో ఫీచర్‌లను స్టాండర్డ్‌ గా ఉంచడం ఈ తరహా నిర్ణయానికి కారణం కావచ్చు. మరియు యాడ్స్‌తో కూడిన ప్లాన్‌లో ఆఫ్‌ లైన్‌ డౌన్‌లోడ్‌ కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను కారణంగా ఈ నిర్ణయం వెపు మొగ్గు చూపవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ తన వద్ద ఉన్న సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తుంది. అయితే ఈ విండోస్‌లో ఉన్న ఫీచర్‌ తక్కువ మంది మాత్రమే వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే.. ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ ఫీచర్‌ను తొలగించే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై నెట్‌ఫ్లిక్స్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Netflix may remove offline download feature in windows app here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X