ఎంటర్టెన్మెంట్‌.. ఎంటర్టెన్మెంట్‌.. ఎంటర్టెన్మెంట్‌

Posted By:

ఎంటర్టెన్మెంట్‌.. ఎంటర్టెన్మెంట్‌.. ఎంటర్టెన్మెంట్‌

 

అమెరికా ఆన్‌లైన్ వీడియో, డివిడి రెంటల్ కంపెనీ 'నెట్‌ఫ్లిక్స్' సోమవారం లండన్, ఐర్లాండ్‌లో ప్రారంభించింది. ఈ సందర్బంలో 'నెట్‌ఫ్లిక్స్' ప్రతినిధులు మాట్లాడుతూ కస్టమర్స్‌కు ఎంటర్టెన్మెంట్‌ని అందించే భాగంగా రెండు దేశాలలోను ప్రారంభించామన్నారు. సినిమాలకు, టివి ప్రోగ్రామ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్(చందా) సర్వీస్‌లను అందిస్తున్న  'నెట్‌ఫ్లిక్స్' అన్ లిమిటెడ్ ఆఫర్స్‌ని లండన్, ఐర్లాండ్ ప్రజలకు అందించనుంది.

ఎంటర్టెన్మెంట్‌ని ఎంజాయ్ చేసేందుకు గాను లండన్ ప్రజలకు 5.99 పౌండ్స్ ($9.23), ఐర్లాండ్ ప్రజలకు 6.99 యూరోస్‌ని చెల్లించ వలసిందిగా కోరింది. వినియోగదారులు ఎవరైతే ఈ ఒప్పందానికి అంగీకరిస్తారో వారికి ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైజ్(స్మార్ట్ టివీలు, టాబ్లెట్స్, బ్లూ రే ప్లేయర్స్) ద్వారా హాలీవుడ్‌, లోకల్, గ్లోబల్ టివి ప్రోగ్రామ్స్‌తో పాటు సినిమాలను టీవి ద్వారా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.

బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టర్స్ బిబిసి, ఛానల్ 4, ఐటివి, కంటెంట్ క్రియేటర్స్ అయిన డిస్నీ, పారామౌంట్, ట్వంటీ సెంచరీ ఫాక్స్‌లకు సంబంధించిన సినిమాలు.. టివి ప్రోగ్రామ్స్‌ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. నెట్ ఫ్లిక్స్ కో - ఫౌండర్, ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రీడ్ హ్యాస్టింగ్స్ మాట్లాడుతూ ఇంగ్లాండ్, ఐర్లాండ్  కస్టమర్స్ అతి తక్కువ ధరలో బ్రహ్మాండమైన సినిమాలను వీక్షించే అవకాశాన్ని నెట్ ఫ్లిక్స్ కల్పిస్తుందని అన్నారు. గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో అపార అనుభవాన్ని సంపాదించిన నెట్‌ఫ్లిక్స్ కస్టమర్స్‌కు అతి తక్కువ ధరలో టివి ప్రోగ్రామ్స్, ఫిల్మ్ కంటెంట్‌ని అందిస్తున్నందుకు స్వాగతించారు.

గతయేడాది నెట్‌ఫ్లిక్స్ 61శాతం మార్కెట్‌ని సంపాదించుకొని, మూడవ త్రైమాసికంలో 800,000 కస్టమర్స్‌ని కలిగి ఉంది.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot