Netflix స్ట్రీమింగ్ ను ఉచితంగా పొందే అవకాశం!! ఎప్పుడో తెలుసా??

|

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని వినియోగదారులందరికి రెండు రోజుల పాటు యాక్సిస్ ను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇండియాలో తన యొక్క స్ట్రీమ్‌ఫెస్ట్ ఈవెంట్‌ను ఇటీవల ప్రకటించింది. ఈ స్ట్రీమ్‌ఫెస్ట్ ఈవెంట్ సందర్బంగా మొత్తం వీకెండ్ లో భారతదేశం అంతటా నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలోని కంటెంట్ ను ఉచితంగా ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 5, 2020, 12:00 AM నుండి ప్రారంభమై డిసెంబర్ 6, 2020, 11:59 PM తో ముగుస్తుంది. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ యొక్క మొత్తం కంటెంట్ లైబ్రరీని ఈ కాలంలో ఉచితంగా చూడడానికి అనుమతి లభిస్తుంది. ఈ కార్యక్రమంలో వినియోగదారులు అనేక డాక్యుమెంటరీలు, సిరీస్‌లు, అవార్డు పొందిన సినిమాలు మరిన్నిటిని చూడడానికి అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొవడానికి ముందుకు చదవండి.

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ సైన్-అప్ చేసే విధానం

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ సైన్-అప్ చేసే విధానం

ఇండియాలో నివసించే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ ఉచితంగా లభిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎటువంటి మొత్తం చెల్లించమని అడగదు. ఈవెంట్ ను చూడడం కోసం సైన్-అప్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా netflix.com/StreamFest లింక్‌కి వెళ్లడం లేదా నేరుగా నెట్‌ఫ్లిక్స్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడం. మీ పేరు, ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను పాస్‌వర్డ్‌తో పాటు నమోదు చేసి మీరు స్ట్రీమింగ్ ప్రారంభించవచ్చు. మీరు స్ట్రీమ్‌ఫెస్ట్‌ను చూడడానికి నెట్‌ఫ్లిక్స్ ఇప్పటి నుంచి ఈవెంట్ కోసం సైన్-అప్ చేయడానికి మరియు మీ కోసం రిమైండర్‌ను షెడ్యూల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. షెడ్యూల్ సెట్ చేసిన తర్వాత స్ట్రీమ్‌ఫెస్ట్ లైవ్ లో ఉన్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ మీకు నోటిఫికేషన్ పంపుతుంది.

 

Also Read: OriginOS సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్(OS)ను ప్రకటించిన Vivo బ్రాండ్...Also Read: OriginOS సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్(OS)ను ప్రకటించిన Vivo బ్రాండ్...

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ ఉచిత సైన్ అప్
 

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ ఉచిత సైన్ అప్

స్ట్రీమ్‌ఫెస్ట్ సమయంలో సైన్-ఇన్ చేసే ఏ యూజర్ అయినా ఒక స్ట్రీమ్‌ను స్టాండర్డ్ డెఫినేషన్ లో పొందుతారు. అదే లాగిన్ సమాచారాన్ని వేరే ఏ యూజర్ ఉపయోగించలేరు. ఈ స్ట్రీమ్ ఉచితం కాబట్టి ఏ యూజర్ అయినా సొంతంగా సైన్ అప్ చేయవచ్చు. మీరు దీన్ని చూడగలిగే పరికరంలో ఎటువంటి పరిమితి లేదు. మీరు దీన్ని మీ PC, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, కన్సోల్‌లో కూడా చూడవచ్చు అలాగే మరొక స్క్రీన్‌కు కూడా ప్రసారం చేయవచ్చు.

 

Also Read: AirtelFiber vs JioFiber vs BSNL :తక్కువ ధరలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఇస్తున్న సర్వీస్ ప్రొవైడర్లుAlso Read: AirtelFiber vs JioFiber vs BSNL :తక్కువ ధరలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఇస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు

నెట్‌ఫ్లిక్స్ ఉచిత యాక్సిస్ లో పేమెంట్ ఫీచర్స్

నెట్‌ఫ్లిక్స్ ఉచిత యాక్సిస్ లో పేమెంట్ ఫీచర్స్

నెట్‌ఫ్లిక్స్ యొక్క పేమెంట్ సభ్యులు పొందిన ప్రతి ఫీచర్‌ను మీరు కూడా ఈ రెండు రోజులు యాక్సెస్ చేయగలుగుతారు. విభిన్న ప్రొఫైల్‌లను సృష్టించడం నుండి కంటెంట్ యొక్క విభిన్న జాబితాలను కూడా అదనంగా చూడడనికి వీలుగా ఉంటుంది. మీరు ‘మై లిస్ట్' లో మీరు నచ్చిన సినిమాలు మరియు ఇతర రకాల కంటెంట్‌లను జోడించవచ్చు. వీటిని దాని యొక్క ఉపశీర్షికలతో పాటుగా చూడడానికి వీలుగా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ ఉచిత స్ట్రీమ్‌ఫెస్ట్ లో గుర్తించవలసిన విషయాలు

నెట్‌ఫ్లిక్స్ ఉచిత స్ట్రీమ్‌ఫెస్ట్ లో గుర్తించవలసిన విషయాలు

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ లో గుర్తించదగిన ఏకైక విషయం ఏమిటంటే ఇది రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఒక నిమిషం కూడా దీని యొక్క యాక్సిస్ అందుబాటులో ఉండదు. ఇది ఒక ఉచిత ఈవెంట్ కాబట్టి చాలా మంది వినియోగదారులు హాజరవుతారని భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు చూస్తున్నప్పుడు, నెట్‌ఫ్లిక్స్ మీకు ‘స్ట్రీమింగ్ ఎట్ కెపాసిటీ' చూపిస్తుంది అంటే మీరు తరువాత ప్రసారం చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Netflix StreamFest Free Subscription Opportunity For All Indian Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X