Netplus Broadband నుంచి కొత్త ప్లాన్‌లు: IPTV సర్వీసుతో సహా ట్రిపుల్ ప్లే ప్లాన్‌లు..

|

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ గత ఏడాది తన యొక్క వినియోగదారులకు IPTV సర్వీస్, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మరియు అపరిమిత కాల్‌ వంటి ప్రయోజనాలతో లభించే రెండు 'ట్రిపుల్ ప్లే' ప్లాన్‌లను ప్రకటించింది. గత సంవత్సరం ప్రకటించిన ప్లాన్‌లు రూ.1,099 ధరకే ప్రారంభమయ్యాయి. రూ.1,099 ప్లాన్ 100Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో ఎటువంటి ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) పరిమితి లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో IPTV సేవలను అందించిన మొట్టమొదటి సంస్థ నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ కావడం మరొక విషయం.

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ ఇప్పుడు తన ట్రిపుల్ ప్లే ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. ఇంతకు ముందు రూ.1,099 మరియు రూ.1,199 ధరల వద్ద అందించిన రెండు ప్లాన్‌లకు బదులుగా సంస్థ ఇప్పుడు 3 ‘ట్రిపుల్ ప్లే' ప్లాన్‌లను ఎక్కువ ప్రయోజనాలతో తక్కువ ధర వద్ద అందిస్తుంది. నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ అందించే 3 ‘ట్రిపుల్ ప్లే' ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం SD ప్లాన్

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం SD ప్లాన్

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ నుండి కొత్తగా లభించిన ‘ప్రీమియం SD' ప్లాన్ 999 రూపాయల ధర వద్ద లభించే ఆఫర్‌లో ఉన్న బేస్ ప్లాన్. ఇది 335+ SD ఛానెల్‌లకు యాక్సిస్ ను అందించడంతో పాటుగా వినియోగదారులకు IPTV సేవలను అందిస్తుంది. IPTV సేవలతో పాటు వినియోగదారులు 100 Mbps వేగంతో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను పొందుతారు. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను కూడా ఉచితంగా పొందుతారు. నెట్‌ప్లస్ యొక్క స్మార్ట్ టెలిఫోనీ వినియోగదారులు వారి యొక్క మొబైల్ మరియు ల్యాండ్-లైన్ కనెక్షన్‌లో కాల్‌లను స్వీకరించడానికి అనుమతిస్తుంది.

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం HD ప్లాన్

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్రీమియం HD ప్లాన్

నెట్‌ప్లస్ నుంచి కొత్తగా విడుదలైన ‘ప్రీమియం హెచ్‌డీ' ప్లాన్ నెలకు రూ.1,499 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది వినియోగదారులకు 345+ HD ఛానెల్‌లను IPTV సర్వీసులతో అందిస్తుంది. ఇంకా వినియోగదారులు సంస్థ యొక్క స్మార్ట్ టెలిఫోనీ సర్వీసును మరియు 350 Mbps వేగంతో ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్ ధర GST కి ప్రత్యేకమైనది కావచ్చు.

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాటినం HD ప్లాన్

నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాటినం HD ప్లాన్

‘ప్లాటినం HD' ప్లాన్ నెట్‌ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన ‘ట్రిపుల్ ప్లే' ప్లాన్. ఇది నెలకు రూ.1,599 ధర వద్ద లభిస్తుంది. కంపెనీ IPTV సర్వీసులతో పాటుగా 345+ హెచ్‌డి ఛానెళ్లను మరియు 400Mbps వేగంతో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను అందిస్తుంది. అలాగే సంస్థ యొక్క స్మార్ట్ టెలిఫోనీ సేవతో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు.

నెట్‌ప్లస్ IPTV సర్వీస్ ఆఫర్లు ఏమిటి?

నెట్‌ప్లస్ IPTV సర్వీస్ ఆఫర్లు ఏమిటి?

IPTV సర్వీస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. అంటే కంటెంట్ ను మోసే డేటా ప్యాకెట్లు ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్‌వర్క్‌ల ద్వారా పంపబడతాయి. వినియోగదారులు వారి టీవీలు, మొబైల్స్ మరియు టాబ్లెట్‌లతో సహా బహుళ స్క్రీన్‌లలో ఒకే కనెక్షన్ కంటెంట్‌ను వినియోగించవచ్చు. వినియోగదారులు లైవ్ టీవీ HD ఛానెల్‌ల నుండి కంటెంట్‌ను వినియోగించుకునే అవకాశాన్ని పొందుతారు.


ఇంకా ‘టైమ్ షిఫ్ట్ టీవీ' ఉంది. దీని అర్థం వినియోగదారులు వారు చూడకుండా పోయిన మునుపటి 2 గంటల ప్రోగ్రామ్‌ను చూడవచ్చు. అలాగే ‘క్యాచ్ యుపి టివి' ఫీచర్ వినియోగదారులు వారు కోల్పోయిన గత 7 రోజుల ఏదైనా ప్రోగ్రామ్ లేదా కంటెంట్‌ను తెలుసుకోవడానికి అనుమతిస్తుంది.

ఇంకా వినియోగదారులు నచ్చిన యాప్ లను ఇన్‌స్టాల్ చేయవచ్చు మరియు సైడ్‌లోడ్ చేయవచ్చు. అలాగే తమ అభిమాన కంటెంట్‌ను చూడటానికి కంపెనీ వీడియో-ఆన్-డిమాండ్ (VoD) సర్వీసును ఉపయోగిస్తుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడం గురించి వినియోగదారులు పరిశీలిస్తున్నప్పుడు నెట్‌ప్లస్ ‘ట్రిపుల్ ప్లే' ప్లాన్లు ఇతరులతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి.

 

Best Mobiles in India

English summary
Netplus Broadband New plans: Offers Triple Play Plans With IPTV service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X