airportలోని usb ఛార్జింగ్ పోర్ట్‌లను వాడకండి, juice jacking వచ్చింది
మీరు ట్రావెల్ చేస్తున్నారా, అయితే ట్రావెలింగ్ సమయంలో మిమ్మల్ని ఎక్కువగా వేధించేది ఫోన్ ఛార్జింగ్. ఎయిర్‌పోర్ట్ కాని లేదా కాఫీ షాపుల్లో కాని లేకుంటే పెద్ద పెద్ధ హోటల్స్ లో కాని ఛార్జింగ్ పోర్టులు కనిపిస్తే వెంటనే దానికి ఛార్జర్ ను పెట్టేసి మొబైల్ కి ఛార్జింగ్ ఎక్కించుకుంటుంటారు. అయితే ఇది ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఛార్జింగ్ పెట్టడం ద్వారా యూజర్ల phones and tablets లోని డేటా మొత్తాన్ని హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇందుకోసం వారు సరికొత్త మాల్ వేర్ ని ప్రవేశపెడుతున్నారట. దీనికి వారు పెట్టుకున్న పేరు juice jacking. అక్కడ కనిపించే పోర్టుల్లోని హార్డ్ వేర్ డిజైన్ ని హ్యాకర్లు మార్చివేసి అందులో మాల్ వేర్ ని install చేస్తున్నారు. తద్వారా మీరు ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ మాల్ వేర్ ద్వారా మీ ఫోన్లోని డేటా మొత్తాన్ని తస్కరిస్తున్నారు. ఈ తతంగమంతా మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. మీ ఫోన్ మీ కంట్రోల్ లో లేకుండానే హ్యాకర్లు మీ డేటా మొత్తాన్ని తస్కరిస్తారు. ఈ juice jacking నుంచి మిమ్మల్ని రక్షించుకునేందుకు నిపుణులు కొన్ని సూచనలను చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Use a data blocking adapter
మీరు data blocking adapterను వాడుతున్నట్లయితే దానికి అదనంగా మరొక కేబుల్ ని తగిలించండి. PortaPow 3rd Gen Data Blocker ద్వారా మీరు public USB portsలోని ప్లగ్ లకు ఛార్జింగ్ పెట్టుకోవడం ద్వారా సేప్ గా ఉంటుంది.

Use the electric outlet, not the USB port
మీరు ఎప్పుడైనా బయట ప్రదేశంలో ఛార్జింగ్ పెట్టే సమయంలో electric outletనే ఉపయోగించండి. charging stations వద్ద ఉన్న USB port కన్నా ఇది చాలా సురక్షితం.

Invest in a portable charger
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ public charging stations వాడకండి. దీని బదులు మీరు portable chargerని వాడండి. e Anker PowerCore II Slim 10000 లాంటి ఛార్జర్స్ అమెజాన్ సైట్లో దొరుకుతున్నాయి. వీటిని వాడటం ద్వారా మీరు హ్యాకర్ల భారీ నుంచి తప్పించుకోవచ్చు.

data access
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వారికి మీ ఫోన్ నుంచి access dataని ఇవ్వవద్దు. ఐఫోన్ కనెక్టింగ్ సమయంలో పాప్ అప్ విండో ప్రత్యక్షమవుతుంది. ఇందులో Trust This Computer, Don't Trust అనే రెండు ఆప్సన్లు ఉంటాయి. వీటిల్లో మీరు Don't Trustని సెలక్ట్ చేసుకోండి. మీరు నేరుగా మీ మొబైల్ నుంచి ఇది సెలక్ట్ చేసుకోవాలంటే Settings > General > Reset > Reset Location & Privacyని సెలక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్లయితే Supply Powerని మాత్రమే సెలక్ట్ చేసుకోండి.

రెంటల్ కారు ద్వారా
మీరు ఎక్కడికైనా రెంట్ కి కారు తీసుకెళ్తున్నప్పుడు ఆ కారుకు మీ ఫోన్ కనెక్ట్ చేస్తుంటారు. phone calls, texts, music, navigation వంటి వాటికోసం దానిని వాడుతుంటారు. ఇలాంటి సమయంలో మీడేటా సమాచారం అందులో స్టోర్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మీరు మీ యొక్క ఫోన్ ని unplugging చేసే సమయంలో మీ డేటాను డిలీట్ చేయండి. కారు రిటన్ ఇచ్చే సమయంలో System Settings and/or the Bluetooth వంటి వాటిని మీ డివైస్ నుంచి వెంటనే డిలీట్ చేయండి. వీలయితే factory reset option, perform a factory reset వంటి వాటిని ప్రయత్నించండి.


Click it and Unblock the Notifications