మందుబాబుల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్

Posted By:

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వైన్ కంపెనీ జాకబ్స్ గ్రీక్ మందుబాబుల కోసం ప్రపంచపు మొట్టమొదటి రియాల్టీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అప్లికేషన్ పేరు వైన్ లైన్... ఈ యూప్ ప్రత్యేకతను పరిశీలించినట్లయితే... పార్టీలో అందుబాటులో ఉన్న వైన్ బ్రాండ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌కు చేరవేస్తుంది. తద్వారా నచ్చిన బ్రాండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాదండోయే ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా ఈ అప్లికేషన్ సెలవిస్తుంది.

మందుబాబుల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్

దర్జాగా ముందుకొట్టి ఆపై గమ్తత్తైన మత్తులో జోగుతూ ఎంచక్కా డ్రైవ్ చేసే మందబాబులు ఇక పై ఖాకీల నిఘా నుంచి తప్పించుకోలేరు. ఆల్కహాల్ సేవించిన వారిని కేవలం కటిచూపుతో కొత్త టెక్నాలజీని గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. శరరీ ఉష్ణోగ్రతల్లో మార్పులు ఆధారంగా మందు తాగింది లేనిది నిర్థారించవచ్చిన పరిశోధకులు చెబుతున్నారు. తాగిన మైకంలో ఉన్నవారు బుద్ధిగా ఉన్నప్పటికి ఈ యంత్రం కనిపెట్టేస్తుంది.

ప్రస్తుతం ఆల్కహాల్ తీసుకున్న వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్లు వాడుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే తప్పతాగి తెలివిగా డ్రైవ్ చేసే మందుబాబులకు ఖాకీల నుంచి చిక్కులు తప్పవు. కొత్త విధానంలో ముఖంపై వివిధ భాగాల ఉష్ణోగ్రతలను ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో నమోదు చేస్తారు. వీటిని విశ్లేషించి గుంపులో ఉన్నామద్యం తాగిన వారిని కచ్చితంగా గుర్తించవచ్చు. ఆల్కహాల్ తీసుకున్న వారి బుగ్గలపై రక్తనాళాలు స్వల్పంగా వ్యాకోచించటం, వదిలే శ్వాసలో వేడి కొద్దిగా పెరగటం లాంటి లక్షణాలతో గుర్తించొచ్చు. తాగిన వారిలో నుదురుతో పోల్చినప్పుడు నాసిక వద్ద ఉష్ణోగ్రతపెరుగుతుంది. అంటువ్యాధులు సోకిన వారిని గుర్తించేందుకు గతంలో ఎయిర్‌పోర్టులో ఈ విధానాన్ని వినియోగించారు. రద్దీ ప్రాంతాలతోపాటు క్రీడల సమయంలో మందుబాబులను గుర్తించేం దుకు భద్రతా సిబ్బందికి ఈ పద్ధతి సాయపడుతుందని పరిశోధకులుతెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot