మహిళా భద్రత కోసం కొత్త అప్లికేషన్

మహిళల పై రోజురోజుకు పెరిగిపోతున్న దౌర్జన్యాలను అరికట్టేక్రమంలో ‘సేవ్ మై సౌల్' (save My Soul) పేరుతో సరికొత్త మహిళా భద్రతా అప్లికేషన్‌ను బెంగుళూరు నగరానికి చెందిన బీఎంఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు. ఉపయుక్తకరమైన ఈ యాప్‌ను సోమవారం కళాశాల ఛైర్మన్ డా.బీఎస్.రాగిణినారాయణ్ ఆవిష్కరించారు.
మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించే దృక్పథంతో తయారు చేయబడిన ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో మహిళలు తాము ఉన్న ప్రదేశాన్ని కోట్ చేస్తూ వెంటనే హెల్ప్ మి(help me) అని టైప్ చేసి సంక్షిప్తం సందేశం పంపాలి. కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు చెందిన నంబరుకు కానీ, గ్రూప్ నంబర్లకు కానీ సంక్లిప్తం సందేశాన్ని పంపవచ్చు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఉన్న ప్రదేశానికి సంబంధించిన సమాచారం జీపీఎస్ ద్వారా సంబంధిత వ్యక్తులకు వెంటనే అందుతుంది.
ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
యాపిల్ ఐఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








