కొత్త బైక్ కొన్నారా.. ఐతే ఈ 5 టెక్ యాక్సెసరీలు మీ రైడ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి!
Bike Tech Accessories: కొత్త బైక్ కొంటే ఎంతో హుషారుగా ఉంటుంది. వివిధ ప్రదేశాలకు బైక్ పై దూసుకెళ్లాలనిపిస్తుంది. కానీ, రోడ్లపై వెళ్లేటప్పుడు తగినంత భద్రత అవసరం. అయితే సరైన యాక్సెసరీలు ఉంటే మీ ప్రతీ రైడ్ మరింత సురక్షితంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. మీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచాలని అనుకుంటే ఈ ఐదు అదిరిపోయే గాడ్జెట్స్‌ని అస్సలు మిస్ అవ్వకండి. ఇవి ఎమర్జెన్సీలో మీకు సాయపడటమే కాదు, మీ జర్నీని సౌకర్యవంతంగా మార్చేస్తాయి.
* టైర్ ఇన్‌ఫ్లేటర్ - ఎమర్జెన్సీకి రెడీగా ఉండొచ్చు
బైకర్స్‌కి పంచర్లు కావడం సర్వసాధారణం. ఎప్పుడైనా టైర్ పంచర్ అయ్యి ఎక్కడైనా ఇరుక్కుపోతే, ఈ టైర్ ఇన్‌ఫ్లేటర్ మీ ప్రాణాల్ని కాపాడుతుంది. పంచర్ కిట్‌తో పాటు ఇది ఉంటే చాలు, టైర్‌ని మళ్లీ గాలితో నింపి క్షణాల్లో రోడ్డు మీదకి వచ్చేయొచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్స్‌లో టైర్ ప్రెజర్ సరిగ్గా ఉంచుకోవడం ముఖ్యం.

టైర్ ప్రెజర్ సరిగ్గా ఉంచుకోవడానికి ఒక ఎయిర్ పంప్ కొనుగోలు చేయడం తప్పనిసరి. మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి కానీ థామ్సన్ 150 PSI టైర్ ఎయిర్ పంప్ ఉత్తమంగా నిలుస్తోంది దీనికి మంచి రివ్యూలు కూడా ఉన్నాయి. దీని ధర కూడా జస్ట్ రూ.1,200 మాత్రమే.
* ఫోన్ హోల్డర్
ఫోన్ హోల్డర్ మీ స్మార్ట్‌ఫోన్‌ని బైక్‌కి ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. కొత్త ప్లేస్‌లలో రైడ్ చేస్తున్నప్పుడు నావిగేషన్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ, వైబ్రేషన్ డాంపర్ ఉన్న హోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం. ఇది రోడ్ల మీద గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ వల్ల మీ ఫోన్‌కి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
ఇది ఒక్కోసారి రోడ్డుపై నుంచి దృష్టి మరల్చే అంతరాయం లాగా అనిపించినా, ఈ రోజుల్లో బైకర్స్‌కి ఇది కచ్చితంగా కావాల్సిన యాక్సెసరీ. ఎందుకంటే కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారి తెలిసే అవకాశం లేదు అలాంటప్పుడు ఫోన్ పైనే ఆధారపడాలి. ఫోన్ హోల్డర్ ఉంటేనే అది సాధ్యం.
* స్మార్ట్ ట్రాకర్‌తో మీ బైక్ ఎప్పటికీ మిస్ అవ్వదు..
మీ బైక్ ఎక్కడ పార్క్ చేశారో మర్చిపోతారా? ఐతే ఈ స్మార్ట్ ట్రాకర్ మీకోసమే. దీన్ని మీ బైక్‌లో ఎక్కడైనా దాచేయొచ్చు. మీ ఫోన్ యూజ్ చేసి బైక్ ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మీ బైక్‌ను ఎవరైనా దొంగిలించినా, దీన్ని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది.
ఆండ్రాయిడ్ యూజర్స్‌కి జియో ట్యాగ్ ఉత్తమమైన స్మార్ట్ ట్రాకర్ గా నిలుస్తోంది. ఐఫోన్ యూజర్స్ ఎయిర్‌ట్యాగ్ లేదా తక్కువ ధరలో జియోTag ఎయిర్ వాడొచ్చు. ఈ డివైజ్‌లు కనెక్టెడ్ నెట్‌వర్క్స్ యూజ్ చేసి మీ బైక్ లొకేషన్‌ని కరెక్ట్‌గా చూపిస్తాయి. ఇవి నచ్చకపోతే వేరేవి కూడా చెక్ చేయవచ్చు.
* హెల్మెట్ ఇంటర్‌కామ్
హెల్మెట్ ఇంటర్‌కామ్ ఉంటే మీ ఫ్రెండ్స్‌తో ఫోన్ లేకుండానే మాట్లాడొచ్చు. ఇది వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కంటే చాలా సేఫ్. ఎందుకంటే ఇది బయటి సౌండ్స్‌ని బ్లాక్ చేయదు. అంటే మీరు ట్రాఫిక్ సౌండ్స్‌ని వింటూనే సేఫ్‌గా మాట్లాడొచ్చు. చాలా ఇంటర్‌కామ్స్‌ని ఈజీగా ఏ హెల్మెట్‌కైనా ఫిక్స్ చేయొచ్చు.
కావాలంటే ఒక హెల్మెట్ నుంచి ఇంకో హెల్మెట్‌కి మార్చుకోవచ్చు కూడా. వీటి ధరలు రూ.2,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫీచర్స్‌ని బట్టి రేట్లు పెరుగుతాయి. ఒకవేళ ట్రాఫిక్ లో అసలు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయము అనుకుంటే ఇది అవసరం లేదు. కానీ కొన్నిసార్లు అర్జెంట్ కాల్స్ వస్తాయి అలాంటప్పుడు ఇది పనికొస్తుంది.
* యాక్షన్ కెమెరా
యాక్షన్ కెమెరా లగ్జరీ అనుకోవచ్చు. కానీ, ఇది భద్రతను పెంచుతుంది. ఇది మీ రైడ్స్‌ని రికార్డ్ చేస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్స్ లేదా గొడవలు జరిగితే ఇది ప్రూఫ్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, మీ బైకింగ్ సాహసాలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది.
ఎంట్రీ లెవెల్ కెమెరాలు రూ.2,000 నుంచి స్టార్ట్ అవుతాయి. హై-ఎండ్ మోడల్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి. వాటి ధర రూ.50,000 వరకు ఉంటుంది. ఈ ఐదు యాక్సెసరీలు మీ బైకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కాపాడతాయి.


Click it and Unblock the Notifications








