క్వాల్కమ్ చిప్‌లో కొత్త బగ్ గుర్తింపు!! ప్రమాదంలో 30 శాతం ఫోన్‌లు

|

ప్రముఖ క్వాల్కమ్ సంస్థ కొత్తగా ఉత్పత్తి చేసిన ఫోన్ చిప్‌లలో ఒక బగ్ కనుగొనబడింది. ఇది బాధితుడి ఫోన్ కాల్‌లు మరియు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా దాడి చేసేవారికి ప్రభావిత పరికరాల్లోకి అనుమతించి వినియోగదారుల యొక్క పర్సనల్ డేటాను పొందడానికి యాక్సిస్ ను ఇవ్వడంతో పాటుగా దోపిడీ చేయడానికి వీలును కల్పిస్తుంది. చెక్ పాయింట్ రీసెర్చ్ మొదటగా ఈ బగ్‌ను కనుగొని నివేదించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చురుకుగా ఉన్న 30 శాతం స్మార్ట్‌ఫోన్‌లపై ఈ బగ్ దోపిడీకి గురిచేస్తుందని పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

చెక్ పాయింట్ రీసెర్చ్

చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం క్వాల్కమ్ చిప్ లో కనుగొన్న ఈ బగ్ ప్రస్తుతం శామ్‌సంగ్, గూగుల్, షియోమి, ఎల్‌జి తో సహా మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల పరికరాల మీద ప్రభావితం చూపుతున్నది. గ్లోబల్ పరంగా ఫోన్లను వాడుతున్న మొత్తం జనాభాలో ప్రస్తుతం 40 శాతం మంది ఈ హాని కలిగించే చిప్స్ ఉపయోగించబడుతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే 30 శాతం మంది దాడులను నిర్వహించడానికి అవసరమైన యాజమాన్య ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ MSM ఇంటర్ఫేస్ (QMI) వంటివి కలిగి ఉన్నారు.

MSM

మొబైల్ స్టేషన్ మోడెమ్ (MSM) అనేది బగ్ ద్వారా ప్రభావితమైన భాగం. ఇది ఫోన్‌లోని ముఖ్యమైన భాగాలకు మెజారిటీ సామర్థ్యాలను అందించడానికి బాధ్యత వహిస్తుంది. వివరంగా చెప్పాలంటే దాడికి హానికరమైన ట్రోజనైజ్డ్ యాప్ లేదా ఇతర పద్ధతుల ద్వారా టార్గెట్ డివైస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కు యాక్సిస్ అవసరం. దాడి చేసిన వ్యక్తి యాక్సిస్ ను పొందిన తరువాత వారు సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హానికరమైన కోడ్‌ను మోడెమ్‌లోకి ప్రవేశపెట్టవచ్చు.

సాఫ్ట్‌వేర్
 

కొన్ని నివేదికల ప్రకారం MSM లోని విభిన్న సాఫ్ట్‌వేర్ భాగాల మధ్య కమ్యూనికేషన్‌ను నియంత్రించే ప్రోటోకాల్ రకమైన దాడి ఫోన్ యొక్క QMI ను హైజాక్ చేస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇటువంటి దాడితో హ్యాకర్లు టెక్స్ట్ మెసేజ్లను మరియు బాధితుడి కాల్ హిస్టరీను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారుడి యొక్క ఫోన్ కాల్‌లను వినే సామర్థ్యాన్ని కూడా హకెర్లకు అందిస్తుంది. డివైస్ యొక్క సిమ్ కార్డుకు యాక్సిస్ ను అందించే కొన్ని సందర్భాలు మరింత ఘోరంగా ఉండవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
New bug Detection on Qualcomm Chip !! Globally 30 Percent of Phones on Risk

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X