జూన్ 1 వ తేదీ నుంచి ఏయే మార్పులు రానున్నాయో తెలుసా.. ఆధార్ కార్డులు, EPFO, బ్యాంకులు సహా..!
New Changes from June 2025 : ప్రతి నెల ఒకటో తేదీ నుంచి అనేక కొత్త నిర్ణయాలను సంస్థలు అమలు చేస్తుంటాయి. జూన్ నెలలోనూ అనేక మార్పులు రానున్నాయి. ఇందులో బ్యాంకులు, EPFO, ఆధార్ అప్‌డేట్ వంటివి అనేకం ఉన్నాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా నిబంధనల్లోనూ కొన్ని మార్పులు రానున్నాయి. ప్రతి నెల 1 వ తేదీన గ్యా్స్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ వివరాలు 1 వ తేదీన వెల్లడి కానున్నాయి.
EPFO 3.0 :
జూన్‌లో నెలలో EPFO లో కీలక మార్పులను గమనించవచ్చు. ఎంప్లయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. EPFO 3.0 ద్వారా PF నగదును ATM ల నుంచి నేరుగా తీసుకొనేందుకు అవకాశం కలగడంతోపాటు క్లైయిమ్‌లను మరింత వేగంగా పరిష్కారం కానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆధార్ కార్డుల అప్‌డేట్ :
ఆధార్ కార్డులను (Aadhaar Card Update) అప్‌డేట్ చేసుకొనేందుకు కేంద్రం గత సంవత్సరం నుంచి గడువు పొడిగిస్తూనే ఉంది. అయితే తాజా గడువు ఈ జూన్ 14 తేదీతో ముగుస్తుంది. ప్రస్తుత గడువులో మై ఆధార్ యాప్ ద్వారా వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రాల్లో రూ.50 చెల్లించి వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ATM నుంచి నగదు విత్‌డ్రా నిబంధనలు :
జూన్ 1 నుంచి ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా పై ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉచిత ట్రాన్సాక్షన్‌ల తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ పై రూ.21 నుంచి రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే బ్యాంకులకు RBI అనుమతి ఇచ్చింది. ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాలను తగ్గించుకుంటే మంచిది.
క్రెడిట్ కార్డు రూల్స్ :
కోటక్ మహీంద్రా కొన్ని క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లపై కోత పెట్టింది. జూన్ 1 వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కొన్ని క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లలో మార్పులు, ఫీజులను పెంచుతోంది. యాక్సెస్ బ్యాంకు రెంట్, టెలికాం, వాలెట్, ఇన్సూరెన్స్, ఎడ్యూకేషన్ వంటి లావాదేవీలపై అందించే రివార్డులపై కోత విధించనుంది. జూన్ 20 నుంచి ఈ మార్పులు ఉండనున్నాయి.
LPG సిలిండర్ ధర :
ప్రతి నెల ఒకటో తేదీని LPG సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. మే నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి. మిగిలిన వాటిలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ నెల 1 వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో వచ్చే మార్పుల వివరాలు వెల్లడి కానున్నాయి.
ఫిక్సడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు :
జూన్ 6 వ తేదీన సమావేశం జరగనుంది. ఇందులో రెపో రేట్‌ను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు FD వడ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం ఉంది. హోం, వాహనాలకు సంబంధించిన రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








