Home
News

అక్టోబర్ నెలలో వచ్చే మార్పులివే.. రైల్వే, ఆన్‌లైన్‌ గేమింగ్‌, పెన్షన్‌, UPI లో కీలక మార్పులు..!

New changes from October 1 2025 : అక్టోబర్‌ 2025 నెలలో అనేక మార్పులు రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే, యూపీఐ, గ్యాస్‌ ధర సహా అనేక అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే అక్టోబర్‌ నెలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ కొత్త రూల్స్‌ కొందరి పై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి, మరికొందరిపై పరోక్షంగా ప్రభావం చూపుతాయి.

రైల్వే కీలక నిబంధన అమల్లోకి :
రైల్వే ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైల్వే తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ అథెంటిఫికేషన్‌, OTP నిబంధన అమల్లోకి తీసుకొచ్చిన రైల్వే బోర్డు.. సాధారణ టికెట్ల బుకింగ్‌ కోసం కూడా ఆధార్‌ అథెంటిఫికేషన్‌ నిబంధన అమల్లోకి తీసుకురానుంది. అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనుంది.

New changes from October 1 2025

ఇందులో భాగంగా రైల్వే టికెట్లు అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలి 15 నిమిషాల వరకు ఆధార్‌ అథెంటిఫికేషన్‌ పూర్తి చేసిన యూజర్లు మాత్రమే టికెట్లను బుకింగ్‌ చేసుకొనేందుకు వీలుంటుంది. IRCTC యాప్‌, వెబ్‌సైట్‌ నుంచి బుకింగ్‌ చేసుకొనే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని రైల్వే తెలిపింది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం అమలు :
ఆన్‌లైన్‌ గేమింగ్‌ కారణంగా అనేక మంది ఆర్థికంగా బలైపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. యువత కూడా దీని బారిన పడి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారనే కారణంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించనుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించనుంది. దీంతోపాటు ప్రమోటర్‌లకు 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

గ్యాస్‌ ధరల్లో మార్పు :
నెలలో ఒకటో తేదీన అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. గృహ ‌అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరలో ఇటీవల కాలంగా మార్పులు జరగలేదు. అయితే వాణిజ్య సిలిండర్‌లో ఇటీవల కొన్ని మార్పులు వచ్చాయి. అక్టోబర్ నెలలో వచ్చే మార్పులు ఒకటో తేదీన తెలియనుంది.

యూపీఐలో కీలక మార్పులు :
అక్టోబర్ నెలలో యూపీఐ కీలక మార్పులు రానున్నాయని భావిస్తున్నారు. ఈ మార్పులు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లను ప్రభావితం చేస్తాయి. యూపీఐ పీర్‌ టూ పీర్‌ (P2P) లావాదేవీలను NPCI (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తొలగించే అవకాశం ఉంది.

ఇందుకు సంబంధించిన సర్క్యూలర్‌ జులై 9 వచ్చింది. అక్టోబర్ 1 నుంచి వీటిని నిలిపివేసే అవకాశం ఉంది. భద్రతను బలోపేతం చేయడం సహా ఆర్థిక మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పెన్షన్‌ నిబంధనల్లో కీలక మార్పులు :
అటల్‌ పెన్షన్‌ యోజన (APY), నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌ (NPS) లో కొన్ని మార్పులు రానున్నాయి. అక్టోబర్‌ 1 నుంచి CRA (సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ) వసూలు చేసే ఫీజును పెన్షన్‌ ఫండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సవరించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
New changes from October 1 2025 railway, UPI, Online gaming and many here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X