ప్రపంచానికి మరో సైబర్ ముప్పు..మీ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు భద్రం..

By Hazarath
|

ప్రపంచాన్నిమరో సైబర్ అటాక్ వణికిస్తోంది. గతేడాది హ్యాకర్లు వదిలిన ర్యామ్‌సమ్ హ్యాకింగ్ దాడులు మరచిపోకముందే సైబర్‌ నేరగాళ్లు ప్రపంచంపై మరోసారి మరో మాల్వేర్‌తో విరుచుపడ్డారు. ఎంత పటిష్టంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా.. హ్యాకర్లు మాత్రం అంతేస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇప్పుడు ప్రపంచాన్ని బ్యాడ్‌రాబిట్‌ మల్వేర్‌ వణికిస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌, జపాన్‌లపై బ్యాడ్‌రాబిట్‌ తీవ్రస్థాయిలో దాడి చేసింది.

 

రియలిస్టిక్ అనుభూతులతో LG అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌రియలిస్టిక్ అనుభూతులతో LG అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌

బ్యాడ్‌ రాబిట్‌..

బ్యాడ్‌ రాబిట్‌..

బ్యాడ్‌ రాబిట్‌ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే రష్యా, జపాన్‌, ఉక్రెయిన్‌లపై ఇది దాడి చేసింది. ఆ దేశాల్లో రక్షణ, రవాణా రంగాల్ని కూడా ఇది స్తంభింపజేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతోంది. ఈ వైరస్‌ను కొందరు హ్యాకర్లు రెండ్రో జుల క్రితం విడుదల చేశారు.

 ఉక్రెయిన్‌లో ఎయిర్‌ పోర్టులను..

ఉక్రెయిన్‌లో ఎయిర్‌ పోర్టులను..

ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఎయిర్‌ పోర్టులను అనుసంధానిస్తున్న సర్వర్లలోకి ఇది దూరింది. ఈ ఫలితంగా ఎయిర్‌పోర్టుల్లో రవాణా ఆగిపోయింది.

గతేడాది నవంబర్‌లో..
 

గతేడాది నవంబర్‌లో..

గతేడాది నవంబర్‌లో రామ్‌సమ్‌ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా సుమారు 190 దేశాలపై దాడిచేసింది. మిలియన్‌ డాలర్లకుపైగా ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. అనేక దేశాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థను స్తంభింపజేసింది. కొన్ని దేశా ల్లో రక్షణా వ్యవస్థలో కూడా ఇది చొరబడింది. చివరకు ఇది అమెరికా రక్షణ శాఖ నుంచే విడుదలైనట్లు సందేహా లు కూడా వెల్లడయ్యాయి.

ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ రంగం బయటపడక ముందే..

ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ రంగం బయటపడక ముందే..

ఈ ముప్పు బారి నుంచి ఇంకా ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ రంగం బయటపడక ముందే బ్యాడ్‌రాబిట్‌ పేరిట మరో భయంకరమైన వైరస్‌ను అభివృద్ధి చేసి వదిలారు. ఇది మౌలిక సదు పాయాల కల్పన, రవాణా, ఆర్థిక వ్యవస్థలపై దాడిచేసే విధంగా రూపుదిద్దుకుంది.

కంప్యూటర్‌లో ప్రవేశిస్తే..

కంప్యూటర్‌లో ప్రవేశిస్తే..

ఇది కంప్యూటర్‌లో ప్రవేశిస్తే సిస్టమ్‌ వెంటనే లాకౌట్‌ అవుతుంది. తిరిగి దీన్ని తెరవాలంటే హ్యాకర్లకు ముడుపులిచ్చుకోక తప్పదు.

భారత్‌పై కూడా..

భారత్‌పై కూడా..

ఈ వైరస్‌ ఇప్పుడు శరవేగంతో విస్తరిస్తోంది. హ్యాకర్ల లక్ష్యం భారత్‌పై కూడా ఉన్నట్లు సందేహిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ళు గత కొంతకాలంగా తమ కార్యకలాపాల్ని విస్తృతపర్చా రు. ఇందుకు కొన్ని దేశాలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలియని సైట్ల నుంచి సమాచారాన్ని..

తెలియని సైట్ల నుంచి సమాచారాన్ని..

తెలియని సైట్ల నుంచి సమాచారాన్ని దిగుమతి చేసుకోవడం, అనుమానాస్పద లింకుల్ని తెరవడం వంటి చర్యలపై నియంత్రణ ద్వారా ఈ వైరస్‌ వ్యక్తిగత కంప్యూటర్లలో చొరబడ కుండా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Best Mobiles in India

English summary
New cyberattack BadRabbit hits Russia, Ukraine more News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X