ఫోన్ తీస్తే కారు నడవదు!

Posted By:

రోడ్డు ప్రమాదాలాను నివారించే క్రమంలో యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ వర్జీనియా సంస్థ.. ‘ఓరిగో సేఫ్' (ORIGO Safe) పేరుతో సరికొత్త డివైజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాద నివారిణి ముఖ్యంగా కార్ డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్‌ల ద్వారా ఎస్ఎంఎస్‌లు పంపుకునే వారిని అలర్ట్ చేస్తుంది.

ఈ సరికొత్త సిస్టంను కారులో ఇన్స్‌స్టాల్ చేసినట్లయితే సదరు వాహనాన్ని నడిపే వ్యక్తి ముందుగా తన స్మార్ట్‌ఫోన్‌ను కారులో అమర్చిన ఓరిగో సేఫ్ డివైజ్‌లో ఇన్సర్ట్ చేయవల్సి ఉంటుంది. డ్రైవింగ్ సమయంలో కాల్స్‌ను బ్లూటూత్ ఆధారంగానే డయల్ లేదా రిసీవ్ చేసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ డ్రైవింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను సదరు డివైజ్ నుంచి అన్‌ప్లగ్ చేసినట్లయితే కారు నిలిచిపోతుంది.

ఫోన్ తీస్తే కారు నడవదు!

మళ్లి కారును స్టార్ట్ చేయాలంటే స్మార్ట్‌ఫోన్‌ను డివైజ్‌లో ఇన్సర్ట్ చేయాల్సిందే. ఈ సరికొత్త వ్యవస్థను మీ కారులో ఇన్స్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే USD 279 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ 15131) వెచ్చించాల్సిందే.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting