ఫేస్‌బుక్ అప్లికేషన్ (ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు)

Posted By: Prashanth

ఫేస్‌బుక్ అప్లికేషన్ (ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు)

 

ప్రముఖ సామాజిక సంబంధాల సైట్ ‘ఫేస్‌బుక్’ త్వరలో మరో ఆకర్షణీయ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. ఫేస్‌బుక్ స్నేహితులకు మొబైల్ నుంచి ఉచితంగా వాయిస్ కాల్స్, వాయిస్ సందేశాలు చేసుకునేందుకు ఈ సరికొత్త అప్లికేషన్ దోహదపడనుంది. ఈ అప్లికేషన్ ప్రస్తుతానికి కెనడాలోని స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌‍బుక్ యూజర్‌లకు అందుబాటులోకి వచ్చినట్లయితే ఇంటర్నెట్ సాయంతోనే స్నేహితులకు ఫోన్ చేసుకొనే సౌలభ్యం కలుగుతుంది.

ఫేస్‌బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)

ఫేస్‌బుక్ జాకెట్......

ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ‘లైక్’ అంటే ఏంటో తెలుసు. ఆ ‘లైక్’లోని ఫీలింగ్‌ను రుచిచూపించేందుకు అమెరికా విద్యార్ధి మెలిస్సా చౌ ఆధునిక టెక్నాలజీని అనుసరించి ఓ ఫేస్‌బుక్ జాకెట్‌ను తయారు చేసాడు. ‘లైక్ ఎ హగ్’గా పిలవబడుతున్న ఈ జాకెట్‌ను ధరిస్తే, మన స్నేహితులు మనం ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోటోలు, కామెంట్లను లైక్ చేసినప్పుడు.. వారు మనల్ని హత్తుకున్న అనుభూతి కలుగుతుంది. ఎవరైనా ఫేస్‌బుక్‌లో మీ ఫొటోను లేదా ఐటంను లైక్ చేసినట్లయితే.. మొబైల్ జాకెట్‌కు సంకేతాలందుతాయి. వెంటనే అందులోని ఎయిర్ ప్యాకెట్స్ ఉబ్బడం ద్వారా హత్తుకున్న అనుభూతిని కలిగిస్తాయి. అదే సమయంలో మీరు కూడా ఆ జాకెట్‌ను హత్తుకున్నట్లయితే అటువైపు వారు కూడా ఇదే జాకెట్ ధరించి ఉన్నట్లియతే వారికి ఆ అనుభూతి కలుగుతుంది.

బంగారపు యాపిల్ ల్యాప్‌టాప్!

Read In Tamil

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot