ఫేస్‌బుక్ కొత్త డిజైన్ ఫీచర్ 'de-friended'...

Posted By: Super

ఫేస్‌బుక్ కొత్త డిజైన్ ఫీచర్ 'de-friended'...

అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందిన ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇటీవల కాలంలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ విడుదల చేసిన గూగుల్ ప్లస్ వెబ్ సైట్ నుండి పోటీని తట్టుకునేందుకు గాను కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్ ఇటీవల ఓ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఫాక్స్ న్యూస్ ప్రకారం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ఏమిటంటే ఫ్రెండ్స్ లిస్ట్ నుండి ఎవరైతే మిమ్మల్ని తీసివేయజం జరిగింది వారిని మీరు వారిని తెలుసుకొవచ్చు .

ఇంటర్నెట్లో పలు టెక్నాలజీ బ్లాగు నిపుణులు సూచించిన సమాచారం మేరకు సెప్టెంబర్ 29 నుండి ఫేస్‌బుక్‌లో ఈకొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం. దీంతో యూజర్స్ యొక్క యాక్టివిటిస్‌తో పాటు, కుడివైపున ఉన్న ఆర్డర్‌లో ఉన్న యూజర్స్ ఎవరికి సన్నిహితులో కూడా తెలుసుకొవచ్చు. ఇది మాత్రమే కాకుండా లిస్ట్‌లో ఉన్న స్నేహితులతో పాటు, de-friended' ఫీచర్‌ని కూడా కొన్ని నిమిషాలలో తెలుసుకొవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot