ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి

సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానిక

|

సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది.

 
ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి

దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవేంటో చూద్దాం.

చెక్ పాయింట్ టిప్‌లైన్

చెక్ పాయింట్ టిప్‌లైన్

వాట్సప్ లో చెక్ పాయింట్ టిప్‌లైన్ అనే సరికొత్త సాంకేతి విధాన్నాన్ని ప్రవేశపెట్టింది. ఇక చెక్‌పాయింట్ టిప్‌లైన్ సాకేంతిక విధానం ద్వారా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్టవేస్తుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ రూపొందించారు

9643000888కు

9643000888కు

ఇండియాకు చెందిన పీఆర్ఓటీఓ అనే స్టార్టప్ సంస్థ ఆవిష్కరించిన చెక్‌పాయింట్ టిప్‌లైన్ అనే సాంకేతిక విధానంతో వాట్సప్‌లో వచ్చిన సందేశాలను 9643000888కు పంపిచడం ద్వారా అసలు ఆ వార్త నిజమా, కాదా, పుకార్ల అని తెలుసుకోవచ్చని వాట్సప్ వెల్లడించింది.

ప్రోటో వెరిఫికేషన్ సెంటర్‌కు
 

ప్రోటో వెరిఫికేషన్ సెంటర్‌కు

టిప్‌లైన్‌లో మీరు షేర్ చేసిన మెసేజ్ ప్రోటో వెరిఫికేషన్ సెంటర్‌కు వెళ్తుంది. ఆ మెసేజ్‌ను ప్రోటో టీమ్ వెరిఫై చేస్తుంది. మీకు వచ్చిన మెసేజ్ నిజమా, అబద్ధమా, తప్పుడు ప్రచారమా, తప్పుడు సమాచారమా అన్న విషయం మీకు తెలుస్తుందియూజర్స్ పంపే ఫోటోలు, వీడియోలు, సందేశాల్లో అసలు ఎంత వరకు సత్యం, అసత్యం, తప్పుదోవపట్టించేది, వివాదాస్పదమైంది అనే నాలుగు కేటగిరీల ద్వారా విశ్లేంచుకోవచ్చని వెల్లడించింది.
మీకు టెక్స్ట్ రూపంలో వచ్చే మెసేజ్ లేదా ఫోటోలు, వీడియోలు, వీడియో లింకులు ఏవైనా మీరు టిప్‌లైన్‌కు షేర్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాళీ, మళయాళం భాషల్లో సేవలు లభిస్తాయి.
దీంతో పాటుగా మరో కొత్త ఫీచర్ ని గ్రూపుల్లోకి ప్రవేశపెట్టింది. ఎవరైనా గ్రూపుల్లోకి యాడ్ చేయాలంటే అతని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ఫీచర్ పొందాలంటే యూజర్లు Account > Privacy > Groupsలో కెళ్లి అక్కడ కనిపించే Nobody, My Contacts or Everyoneని సెలక్ట్ చేసుకోవాలి.
నోబడి అంటే ఏదైనా గ్రూపులోకి నిన్ను ఎవరైనా లాగితే అక్కడ నీకు రిక్వెస్ట్ వస్తుంది. మీకు ఇష్టమయితే జాయిన్ కావచ్చు. లేకుంటే రిజెక్ట్ కొట్టవచ్చు. ఇక My Contacts సెలక్ట్ చేసుకుంటే నీవు యాడ్ చేసుకున్న కాంటాక్ట్స్ మాత్రమే గ్రూపులోకి ఇన్వైట్ చేస్తారు. ఇక Everyone అంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూపులోకి యాడ్ చేయవచ్చు.

 

 

వదంతులు చెక్ పెట్టేందుకు

వదంతులు చెక్ పెట్టేందుకు

అయితే ఈ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం తొందరగా పాకుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా, అసత్య ప్రచారాలు, వదంతులు చెక్ పెట్టేందుకు వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ వెల్లడించింది.

Search image

Search image

గతంలోనే ఫేక్ న్యూస్‌కు చెక్ చెప్పేందుకు 'Search image' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీకు వచ్చిన ఫోటోను క్లిక్ చేసి 'Search image' పైన క్లిక్ చేస్తే నేరుగా గూగుల్‌లో అలాంటి ఇమేజెస్ ఏవైనా ఉంటే చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ ఫోటో ఎక్కడిది? ఎప్పుడు తీశారు? మీకు వచ్చిన ఫోటోలో ఉన్న సమాచారం నిజమేనా? అని తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
New feature makes WhatsApp Groups less annoying, here's how it works

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X