వెరీగుడ్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్’ ప్రత్యేకతలు

Posted By:

మొబైల్ ఫోన్ అనుభవాలను రోజురోజుకు మార్చేస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్ రకరకాల ఆపరేటింగ్ సిస్టంలతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కప్ కేక్‌తో మొదలైన ఆండ్రాయిడ్ వోఎస్‌ల ప్రస్థానం అంచెలంచెలుగా ఎగబాకుతూ డోనట్.. ఇక్లెయర్.. ఫ్రోయో.. జింజర్ బ్రెడ్.. హనీకూంబ్.. ఇస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్ పేర్లతో విస్తరించింది.

తాజగా ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ ఫీచర్‌లను కలిగి ఆండ్రాయిడ్ ప్రాచుర్యాన్ని మరింత పెంచింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వర్షన్ వోఎస్‌లోని పలు ప్రత్యేక ఫీచర్లను మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ నౌ (Google Now):

ఈ ప్రత్యేక ఫీచర్ వేగవంతమైనా ఇంకా వాస్తవమైన సెర్చ్ అనుభూతులను చేరువ చేస్తుంది. పొందుపరిచిన వాయిస్ సెర్చ్ వ్యవస్థ సహజసిద్ధమైన అనుభూతులకు లోను చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ట్రాఫిక్, స్కోర్ తదితర వివరాలను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ వాయిస్ టైపింగ్ (Offline Voice Typing):

ఇంటర్నెట్ కనెక్టువిటీ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వారికి ఈ ప్రత్యేక ఆఫ్‌లైన్ వాయిస్ టైపింగ్ ఫీచర్ ఎంతగానో మేలు చేస్తుంది. అయితే, ఆఫ్‌లైన్ వాయిస్ టైపింగ్ ఫీచర్ ప్రస్తుతానికి యూఎస్ ఇంగ్లీస్ వర్షన్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

మెరుగుపరచబడిన ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్ (Improvements to Android Beam):

వైర్‌లెస్ టెక్నాలజీ సూత్రం పై స్పందించే ఈ నియర్ - ఫీల్డ్ కమ్యూనికేషన్స్ ఫీచర్ ద్వారా రెండు ఫోన్‌ల మధ్య డేటాను షేర్ చేసుకోవచ్చు.

అద్భుతమైన కీబోర్డు (Amazing Keyboard):

జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ఆడాప్టివ్ కీబోర్డ్ వ్యవస్థ సౌకర్యవంతమైన ఆడ్వాన్సుడ్ టైపింగ్ అనుభూతులను మీకు చేరువచేస్తుంది.

జెల్లీబీన్ కెమెరా అప్లికేషన్ (Jelly Bean camera app):

జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరా అప్లికేషన్ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని మీకు పరిచయం చేస్తుంది. ఈ ఫీచర్ సాయంతో చిత్రీకరించిన ఫోటోలను వేగవంతంగా చూడవచ్చు.

జెల్లీబీన్ బ్యాటరీ శక్తిని పొదుపు చేస్తుంది (Jelly Bean is quick and saves battery):

జెల్లీబీన్ వోఎస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని మరింత పొదుపు చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot