హస్త ప్రయోగంతో పనిలేకుండా... వీర్య దానం?

By Prashanth
|
New for MEN.. HANDS FREE SPERM DONATION!!


లండన్: పై ఫోటోగ్రాఫ్‌లో ఉన్నది ఏటీఎం అనకుంటు పొరబడినట్లే. ఇది వీర్యాన్ని తీసే వినూత్న ఆటోమేటిక్ యంత్రం. ఈ కొత్త తరహా సాంకేతిక యంత్రం ద్వారా వీర్య దాతలు హస్తప్రయోగంతో పనిలేకుండా తమ వీర్యాన్ని దానం చేయవచ్చు. చైనాలోని జియాంగ్సు రాష్ట్ర రాజధాని నాంజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. యంత్రం ముందుభాగంలో ఓ మసాజ్ పైపు ఉంటుంది. తనను వినియోగించుకునే వ్యక్తి నుంచి ఇది వీర్యాన్ని సేకరిస్తుంది. పైపును వినియోగదారుడి ఎత్తుకు అనుగుణంగా అమర్చుకోవచ్చు. యంత్రం వేగం, ఉష్ణోగ్రత, డోలన స్థితులను కూడా నియంత్రించవచ్చు. యంత్రం పైభాగంలోని చిన్న స్క్రీన్‌లో వీర్యసేకరణ ప్రక్రియకు దోహదపడే శృంగార చిత్రాలను చూడొచ్చు. పాత పద్ధతుల్లో వీర్యాన్ని ఇవ్వడానికి ఇబ్బందిపడే వంధ్యత్వ రోగులు ఈ యంత్రాన్ని వాడుతున్నారని జెంగ్‌జౌ హాస్పిటల్ యూరాలజీ విభాగం డెరైక్టర్ చెప్పారు. దీని ఖరీదు షుమారు రూ.1.5 లక్షలు.

సుఖాన్నిచ్చే సెక్స్ రోబోట్!

మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

తమ వాంఛను తీర్చుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. పలువురు అక్రమ సంబంధాల పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు వ్యభిచార కూపాల్లోకి ప్రవేశించి ప్రాణాంతక సుఖ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యను పారద్రోలే క్రమంలో సురక్షత శృంగారం కోసం సెక్స్ బొమ్మలు (సెక్స్ టాయ్స్), సెక్స్ రోబోట్లను కనుగొన్నారు. ఈ అంశానికి సంబంధించి విక్టోరియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2050 నాటికి రోబోటిక్ సెక్స్ ప్రపంచంలో ఓ ముఖ్యమైన చర్చనీయాంశంగా మారనుందన్న విషయాన్ని నిపుణులు రాబట్టగలిగారు.

రానున్న కాలంలో రోబోటిక్ సెక్స్, మానవ సెక్స్ వర్కర్ల మనుగడకు ప్రశ్నార్ధకంగా నిలవనుందని నిపుణులు అంచనావేస్తున్నారు. రోబోటిక్ సెక్స్ వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. శారీరకంగా, ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఈ రోబోలు వివిధ పరిమాణాల్లో లభ్యం కానున్నాయి. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త విధానాన్ని ఇండియా వంటి దేశాల్లో అమలలోకి తెస్తే ఆసాంఘీక కార్యకలాపాలను నిర్మూలించ వచ్చు. వేచి చూద్దాం 2050 నాటికి ఏం జరుగుతుందో.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X