గూగుల్ సెర్చ్ నుంచి అదిరే ఫీచర్, ఒకేసారి రెండు..
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ త్వరలో ఓ అధ్భుతమైన ఫీచర్‌ని యూజర్ల ముందుకు తీసుకురాబోతోంది.
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ త్వరలో ఓ అధ్భుతమైన ఫీచర్‌ని యూజర్ల ముందుకు తీసుకురాబోతోంది. యూజర్ ఏవైనా రెండు ఫోన్ల గురించిన సమాచారం వెదుకుతుంటే వాటి మధ్యలో VS అని ఇచ్చి సెర్చ్ చేస్తే చాలు. దాంతో సెర్చ్ రిజల్ట్స్‌లో ఓ ప్రత్యేక విండో వస్తుంది. అందులో ఆ రెండు ఫోన్ల వివరాలు పక్క పక్కనే వస్తాయి.

ఉదాహరణకు గూగుల్ పిక్సల్ 2 Vs గూగుల్ 2 ఎక్స్ఎల్ అని టైప్ చేస్తే ఒకేసారి మీకు రెండు ఫీచర్లను కంపేర్ చేసి చూపిస్తుంది. ఆ రెండు ఫోన్లలో ఉండే ఫీచర్ల లిస్ట్ కింద సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తుంది. అయితే ఈ ఫీచర్ కేవలం రెండు ఫోన్లను మాత్రమే కంపేర్ చేస్తుంది. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications