మార్చి 16 ఉదయం 8 గంటలకు ఏం జరుగుతుంది..?

Posted By: Super

మార్చి 16 ఉదయం 8 గంటలకు ఏం జరుగుతుంది..?

 

మార్చి 7న శాన్‌ప్రాన్సికోలో అంగరంగ వైభవంగా ఆపిల్ కంపెనీ 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఆపిల్ న్యూ ఐప్యాడ్‌ని ఎప్పుడెప్పుడూ ఇంటికి తీసుకొద్దామా అని ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుంది. మొదట దశలో భాగంగా ఆపిల్ న్యూ ఐప్యాడ్‌ లండన్, అమెరికా, కెనడా, ఆస్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, హాంగ్ కాంగ్, స్విట్జర్లాండ్, సింగపూర్, పుర్టినో రికో లాంటి దేశాలలో లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఆపిల్ కంపెనీ ఆపిల్ న్యూ ఐప్యాడ్‌ ని మార్చి 16వ తారీఖున(శుక్రవారం) ఉదయం 8 గంటలకల్లా ఆయాదేశాలలో ఉన్న ఆపిల్ స్టోర్స్‌లలో దర్శనమిచ్చేలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఈ విషయాన్ని ఆపిల్ అధికారులు అధికారంగా ప్రకటించారు. ఐతే చివరి నిమిషంలో ఈ సమయంలో మార్పు ఉండోచ్చు. సాధారణంగా ఆపిల్ స్టోర్స్  ఉదయం 8 గంటలకు మూసి వేసి ఉంటాయి. అంటే ఆపిల్ స్టోర్స్ ఉదయం 9 గంటలు లేదా 10 గంటల సమయంలో తీయడం జరుగుతుందన్నమాట. అదే అమెరికాలో ఆపిల్ న్యూ ఐప్యాడ్‌ టార్గెట్, వాల్ మార్ట్, శ్యామ్స్ క్లబ్, రేడియో షాక్, బెస్ట్ బై షాపులలో లభ్యమవుతుంది.

ఆపి్ల రిటైల్ అవుట్ లెట్‌లో ఎవరైతే వినియోగదారులు 'ఆపిల్ న్యూ ఐప్యాడ్‌'ని కొనుగోలు చేస్తారో వారికి మాత్రం ఆపిల్ ఫ్రీగా సర్వీస్‌ని అందించనుంది. ఫ్రీ సర్వీస్ అంటే టాబ్లెట్‌ని సంక్షిప్తంగా వినియోగదారునికి తెలియజేయడం, ఈమెయిల్ సెట్టింగ్, కొత్త అప్లికేషన్స్‌ని ఇనిస్టాల్ చెయ్యడం లాంటివన్నమాట. ఆపిల్ వెబ్ సైట్‌లో ఆపిల్ న్యూ ఐప్యాడ్‌ టాబ్లెట్‌ని బుక్ చేసుకోని దగ్గరలో ఉన్న ఆపిల్ స్టోర్‌లో టాబ్లెట్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు. మార్చి 23 నుండి ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని దేశాలలో ఆపిల్ న్యూ ఐప్యాడ్‌ అందుబాటులోకి రానుంది.

ఆపిల్ ‘న్యూ ఐప్యాడ్’ వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot