కొత్త వైరస్ ఇది, మీ ఫోన్ ద్వారానే మీ అకౌంట్లో డబ్బులు గోవిందా

Written By:

ఇప్పుడు కొత్త వైరస్ వచ్చింది. ఈ వైరస్ తో మీకు తెలియకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయమవుతాయి. మీరు ఎంత జాగ్ర్తత్తగా ఉన్నా దాని పని అది చేసుకుపోతుందని సెక్యూరిటీ సంస్థ కాస్పర్ కీ చెబుతోంది. మరి ఆ వైరస్ ఏంటో తెలుసా.. క్సెఫేకాపీ ట్రోజ‌న్‌ అనే వైరస్.

ఆపిల్, శాంసంగ్‌లకు డేంజర్‌ బెల్స్,అదిరే ఫీచర్లతో షియోమి Mi Mix 2 లాంచ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్సెఫేకాపీ ట్రోజ‌న్‌

క్సెఫేకాపీ ట్రోజ‌న్‌` అనే కొత్త మాల్‌వేర్ స్మార్ట్‌ఫోన్ల ద్వారా అకౌంట్ల‌లో ఉన్న‌ డ‌బ్బుల‌ను కాజేస్తోంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ కాస్ప‌ర్స్‌కీ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే దేశంలో ఉన్న 40 శాతం స్మార్‌ఫోన్లకి ఈ మాల్‌వేర్ వ్యాపించి ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

యూజ‌ర్‌కి తెలియ‌కుండానే

వైర్‌లెస్ అప్లికేష‌న్ ప్రొటోకాల్ ద్వారా జ‌రిగే లావాదేవీల‌ను టార్గెట్ చేసి, యూజ‌ర్‌కి తెలియ‌కుండానే డబ్బుల‌ను కాజేస్తుంద‌ని కాస్ప‌ర్స్‌కీ నిపుణులు చెప్పారు.

బ్యాట‌రీ మాస్ట‌ర్‌, క్యాషేక్లీన‌ర్ వంటి యాప్‌ల మాదిరిగా

ఈ మాల్‌వేర్‌ బ్యాట‌రీ మాస్ట‌ర్‌, క్యాషేక్లీన‌ర్ వంటి యాప్‌ల మాదిరిగా క‌నిపిస్తూ ర‌హ‌స్యంగా స్మార్ట్‌ఫోన్‌లోకి వ్యాపిస్తుంది.

బిల్లింగ్ ప‌ద్ధ‌తుల‌ను నాశ‌నం చేసే కోడ్‌ను

త‌ర్వాత బిల్లింగ్ ప‌ద్ధ‌తుల‌ను నాశ‌నం చేసే కోడ్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసి, యూజ‌ర్‌కి తెలియ‌కుండా కొన్ని స‌ర్వీస్‌ల‌ను యాక్టివేట్ చేసి, దానికి కావాల్సిన డ‌బ్బుల‌ను అకౌంట్ నుంచి చెల్లిస్తుంద‌ని వారు వివ‌రించారు.

47 దేశాల్లోని 4,800 మంది వినియోగ‌దారులు

47 దేశాల్లోని 4,800 మంది వినియోగ‌దారులు ఈ మాల్‌వేర్ కార‌ణంగా న‌గ‌దు కోల్పోయార‌ని వారు పేర్కొన్నారు. 

 

 

అప‌రిచిత యాప్‌ల‌ను

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు అప‌రిచిత యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకునేముందు కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కాస్ప‌ర్స్‌కీ ద‌క్షిణాసియా ఎండీ అల్తాఫ్ ఆల్దే హెచ్చరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New malware steals users’ money through mobile phones: Kaspersky Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting