సింగపూర్ ఛాంజీ బిజినెస్ పార్క్‌లో 'ఐబిఎమ్' ఆఫీసు అదుర్స్..

Posted By: Prashanth

సింగపూర్ ఛాంజీ బిజినెస్ పార్క్‌లో 'ఐబిఎమ్' ఆఫీసు అదుర్స్..

 

టెక్నాలజీ దిగ్గజం ఐబిఎమ్ 'పాన్-ఆసియా రీజినల్ సర్వీసెస్ ఆఫీసు' సింగపూర్‌లో స్దాపించడం జరిగింది. ఆసియా రీజియన్‌లో ఆపరేషన్స్‌ని అభివృద్దికి మొట్టమొదటి సారి సింగపూర్‌లో ఐబిఎమ్ దీనిని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తుంది. సింగపూర్‌లోని ఛాంజీ బిజినెస్ పార్క్‌లో ఐబిఎమ్ 'సర్వీసెస్ ఇంటిగ్రేషన్ హాబ్'ని స్దాపించడం మాత్రమే కాకుండా దీనికి సంబంధించిన అన్ని పనులను కొత్త సంవత్సరం జనవరి 2012 నుండి ఫ్రారంభించేందుకు ఐబిఎమ్ టెక్నాలజీస్ సర్వం సిద్దం చేసింది. దీనిని స్దాపించడం ద్వారా ఆసియాకు ఖచ్చితమైన సర్వీస్‌లను అందించగలుగుతామని అన్నారు.

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఇన్యూరెన్స్ ఇండస్ట్రీ, కంజ్యూమర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో కొంత ఫ్రాడ్ జరుగుతుండడంతో దీని ద్వారా వాటన్నింటిని నిరోధించనున్నామని తెలిపారు. ఐబిఎమ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ 'జానెట్ యాంగ్' మాట్లాడుతూ ఐబిఎమ్ ఈ కొత్త సర్వీసులను ప్రారంభించడం వల్ల కస్టమర్స్‌కు మాయొక్క సర్వీసులను 50శాతం ఫాస్టుగా అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేశారు. ఈ ప్రాసెస్‌ని సింగపూర్‌లో నెలకొల్పినందుకు ధన్వవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

సింగపూర్‌లోని ఛాంజీ బిజినెస్ పార్క్‌లో ఐబిఎమ్ కొత్త ఆఫీసులో వందల కొద్ది ఉద్యోగులు తమయొక్క పనులను జనవరి నుండి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతటితో ఆగకుండా రాబోయే కాలంలో ఐబిఎమ్ తన కార్యకలాపాలను వేరే రీజియన్లలలో విస్తరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. గత కొంత కాలంగా సింగపూర్‌ని చూస్తే టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలో అభివృద్ది పధంలో దూసుకుపోతుంది. ఇప్పటికే సింగపూర్‌లో మైక్రోసాప్ట్, ఫేస్‌బుక్, గూగుల్, లింక్డ్ ఇన్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot