పాన్ కార్డు అవసరం లేదు,ఇకపై మీ ఆధార్ నెంబరే పాన్ నెంబర్

By Gizbot Bureau
|

మీకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్ కార్డు) లేదా .. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు పాన్ నంబర్ బదులు ఆధార్ కార్డు వాడొచ్చని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

New PAN card, Aadhaar rules

పాన్ కార్డు అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. ఇంతకుముందు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలంటే ఇప్పటి వరకు పాన్‌కార్డు తప్పనిసరి. ఇపుడు పాన్‌ కార్డు లేకపోయినా రిటర్నులు దాఖలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.

ఆధార్‌ కార్డు నెంబర్‌ను ఇవ్వడం ద్వారా

ఆధార్‌ కార్డు నెంబర్‌ను ఇవ్వడం ద్వారా

పాన్‌కార్డు లేకపోయినా కేవలం ఆధార్‌ కార్డు నెంబర్‌ను ఇవ్వడం ద్వారా ఇక నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దేశంలో ఇప్పటికే ఆధార్‌ కార్డులున్న వారి సంఖ్య 120 కోట్లు దాటడం, సుమారు అన్ని ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయడంతో ఇక పాన్‌ కార్డు లేకపోయినా ఆధార్‌ కార్డు నెంబరును పేర్కొనడం ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.

 మరింత సులభతరం

మరింత సులభతరం

అదే విధంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయడం కూడా మరింత సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జీతం ఆదాయం కాకుండా బ్యాంకు వడ్డీ, డివిడెండ్లు, క్యాపిటల్‌ గెయిన్స్‌ వంటి ఇతర ఆదాయాలు ఉన్న వారు వివిధ ఐటీఆర్‌ ఫారాలను వినియోగించాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ వివరాలను తెలియచేయాల్సిన అవసరం లేదు. వీటి స్థానంలో ప్రీ ఫిల్డ్‌ ఐటీఆర్‌ ఫారంలు అందుబాటులోకి వస్తున్నాయి.

స్టార్టప్‌లకు స్క్రూటినీల నుంచి మినహాంపు

స్టార్టప్‌లకు స్క్రూటినీల నుంచి మినహాంపు

ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేయడానికి బ్యాంకులు, స్టాక్‌ ఎక్స్చేంజీలు, మూచువల్‌ ఫండ్స్‌, ఈపీఎఫ్‌వో, రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రిటర్నుల స్క్రూటినీలు కూడా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే చేయనున్నామని, అలాగే స్టార్టప్‌లకు స్క్రూటినీల నుంచి మినహాంపు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం స్క్రూటినీకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే కావాల్సిన సమాచారాన్ని అడిగి తీసుకుంటారు.

120 కోట్ల మందికి పైగా భారతీయులకు ఆధార్ కార్డు

120 కోట్ల మందికి పైగా భారతీయులకు ఆధార్ కార్డు

దేశంలో 120 కోట్ల మందికి పైగా భారతీయులకు ఆధార్ కార్డు ఉంది. పాన్-ఆధార్ నంబర్లను పరస్పరం మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాం. తనిఖీ సమయంలో పాన్ కార్డు లేకపోతే ఆధార్ నంబర్‌ను, ఆధార్ కార్డు లేకపోతే పాన్ నంబర్‌ను వాడుకోవచ్చు. కాగా బీజేపీ ముందునుంచి ఆధార్ కార్డును హైలెట్ చేసేందుకు చేసే ప్ర‌య‌త్నాల్లో భాగంగానే ఈ ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలోనే ఆధార్ కార్డు ప‌రిధిని కూడా మ‌రింతగా విస్తృత‌ప‌ర‌చ‌నున్నారు.

 ఎన్నారైల‌కు కూడా ఆధార్

ఎన్నారైల‌కు కూడా ఆధార్

విదేశాల్లో ఉన్న ఎన్నారైల‌కు కూడా ఆధార్ అందుబాటులోకి రానుంది. భారతీయ పాస్‌పోర్టు ఉన్న ఎన్నారైలందరికీ ఆధార్‌ కార్డుల కేటాయిస్తారు. ఎన్‌ఆర్‌ఐలు 180 రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్‌ కార్డులు ఇవ్వ‌నున్నారు. ఏదేమైనా తాజా నిర్ణ‌యంతో పాన్ కార్డుకు చాలా మంది గుడ్ బై చెప్పేసే రోజులు కూడా ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయి.

Best Mobiles in India

English summary
New PAN card, Aadhaar rules: 5 things to know about the budget announcement

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X