సోషల్ మీడియాలో ఓ అద్బుతం 'పిన్‌టెరెస్ట్'

Posted By: Prashanth

సోషల్ మీడియాలో ఓ అద్బుతం 'పిన్‌టెరెస్ట్'

 

మార్కెట్లో ప్రస్తుతం చాలా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌ ఉన్నప్పటికీ దేని ప్రత్యేకత దానిదే. ఇంటర్నెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు గాను మరో క్రొత్త సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ 'పిన్‌టెరెస్ట్'. ఈ సోషల్ నెట్ వర్కింగ్ ప్రత్యేకత ఫోటో షేరింగ్. ఇందులో ఉన్న ప్రత్యేకతలు విపరీతంగా ఆడవారి ఆదరణను సొంతం చేసుకుంటుంది. 2010 మార్చిలో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌కు అమెరికాలో రోజుకు కోటీ ఇరవై లక్షల మంది యూనిక్ విజటర్స్ ఉన్నారు. జనవరిలో లండన్లో 68శాతం సోషల్ నెట్ వర్కింగ్ మార్కెట్ ని సొంతం చేసుకుందని సమాచారం.

ఇటీవల కాలంలో పిన్‌టెరిస్ట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొన్న వారిలో 97 శాతం మహిళలు కావడం విశేషం. ఇందులో 25 నుండి 44 యేళ్ల సంవత్సరాలు వయసు కలిగిన ఆడవారు 59 శాతం కాగా.. అంతకు పైబడిన వారు 58 శాతం. ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్‌లో హాల్ చల్ చేస్తున్న ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్‌లలో యూజర్స్ రాత ద్వారా అభిప్రాయాలను పంచుకునేవి కాగా.. పిన్‌టెరిస్ట్‌కి మాత్రం చిత్రాలతో పని ఉంది. క్రియేటివిటీ ఉన్న ఫోటోలకు ఇక్కడ మంచి ప్రాముఖ్యత లభిస్తుంది. ఇందులో పిన్ బోర్డ్ అనే ఆఫ్షన్‌తో ఫోటోలను షేర్ చేసుకునే సదుపాయం ఉంది. పిన్‌టెరిస్ట్‌లో ఉన్న హోమ్ డెకార్, క్రాప్ట్స్, ఫ్యాషన్ పుడ్ లాంటి అరుదైన ఫీచర్లు ఆడవారిని ఇట్టే కట్టిపడేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot