ఆగస్టు నెలలో వచ్చే మార్పులివే.. ఫాస్టాగ్, క్రెడిట్ కార్డులు, UPI రూల్స్‌లో మార్పులు..!
New changes from august 2025 : ప్రతి నెలలో అనేక మార్పులు వస్తుంటాయి. ఆగస్టులోనూ అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందులో బ్యాంకింగ్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డులు, గ్యాస్ సిలిండర్ ధరలు, UPI కొత్త రూల్స్ సహా అనేక నిబంధనల్లో మార్పులు రానున్నాయి. చాలా మంది ఈ నిర్ణయాల కారణంగా ప్రభావితం అవుతారు. ఆగస్టులో ప్రధానంలో అమల్లోకి వచ్చే నిర్ణయాలు.
యూపీఐ రూల్స్‌లో కీలక మార్పులు :
ఆగస్టు 1 నుంచి UPI రూల్స్‌లో కీలక మార్పులు చూడవచ్చు. ఇవాళ్టి నుంచి రోజులో గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే యూపీఐ బ్యాలెన్స్ తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ట్రాన్సాక్షన్ స్టేటస్ రోజులో మూడుసార్లు మాత్రమే చూసేందుకు వీలుంటుంది.

అంటే స్టేటస్ చెక్ చేసేందుకు కనీసం 90 సెకన్లపాటు సమయం ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆటో పే పేమెంట్స్ నిర్వహించేందుకు వీలుండదు. రద్దీ సమయాల్లో ట్రాన్సాక్షన్‌లు విఫలం లేదా ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండేందుకు వీలుగా NPCI ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల నుంచే ఫాస్టాగ్ పాస్ :
కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటన చేసిన ఫాస్టాగ్ పాస్ ఈ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా రూ.3 వేలు చెల్లించి 200 ట్రిప్పులు తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఈ పాస్ యాక్టివేట్ అయిన నుంచి సంవత్సరం లేదా 200 ట్రిప్పులు వరకు జాతీయ రహదారులపై ప్రయాణాలు చేయవచ్చు.
కార్లు, వ్యాన్‌లు, జీప్‌లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ వార్షిక టోల్ పాస్ జారీ చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే తెలిపారు. ఈ వాహనదారులకు ఈ ఫాస్టాగ్ పాస్ ఉపయోగపడే అవకాశం ఉంది.
గ్యాస్ ధరలు :
ప్రతి నెల తరహాలోనే గ్యాస్ ధరలో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి నెల ధరలను సమీక్షిస్తారు. దీని ఆధారంగా గృహ, వాణిజ్య అవసరాల సిలిండర్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ ధరలో మార్పులు వచ్చాయి.
క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ :
యూజర్ల SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులపై అందించే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను తొలగించనుంది. ఆగస్టు 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ప్రీమియం, ఎలైట్, ప్లాటినమ్ కార్డులపై ఈ ప్రభావం ఉంటుంది.
ఈసారి కూడా రేపో రెట్ తగ్గుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ ఆగస్టు 4 నుంచి 6 వరకు జరగనున్నాయి. ఈ సారి కూడా రెపో రేటును భారీగా తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 100 పాయింట్లు తగ్గించారు. ఆగస్టు 6 వ తేదీన ఈ నిర్ణయం వెల్లడి కానుంది. రెపో రేటు తగ్గిస్తే రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం కలుగుతుంది.


Click it and Unblock the Notifications








