Home
News

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. UPI, ATM వినియోగదారులు, పన్నులు కట్టే వారు కచ్చితంగా తెలుసుకోవాలి..!

మరికొన్ని రోజుల్లో ఏప్రిల్‌ నెలతోపాటు కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఏప్రిల్‌ 1 నుంచి (New Rules From April 1 2025) పన్నులు, UPI, ATM ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్‌ రూల్స్‌, క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్స్ సహా ఇతర నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

పన్నుల విధానంలో కీలక మార్పులు :
ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి పన్నుల విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇటీవల బడ్జెట్‌ను అనుసరించి.. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్‌ డిడెక్షన్‌ తో రూ.75 వేలుగా ఉంది. అంటే మొత్తంగా రూ.12.75 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. మరియు రిబేట్‌ రూ.60 వేలకు పెంచారు. ప్రస్తుతం ఇది రూ.25 వేలుగా ఉంది.

New Rules from April 1 2025

బ్యాంకింగ్‌ రూల్స్ :
కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్స్‌ను అప్‌డేట్‌ చేస్తున్నారు. ఈ జాబితాలో SBI, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులున్నాయి. మీరు బ్యాంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం ఎంత బ్యాలెన్స్‌ ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. గ్రామీణ, సెమీ అర్బన్‌, నగరాలను బట్టి మినిమం బ్యాలెన్స్‌ కలిగి ఉండాలి.

ATM రూల్స్‌లో మార్పులు :
దీంతోపాటు ATM ఛార్జీల మోత మోగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఏ ATM నుంచి నగదు విత్‌డ్రా చేయడంపై పరిమితులు ఉండేవి కాదు. అయితే అనంతరం కాలంలో వీటిపై బ్యాంకులు పరిమితులు విధించాయి. ఉదాహరణకు మీరు SBI లో అకౌంట్‌ కలిగి ఉంటే.. ఇతర బ్యాంకుల ATM ల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే నగదు విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువసార్లు ఇతర బ్యాంకుల నుంచి నగదు తీసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20- 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

UPI రూల్స్‌లో మార్పులు :
ఏప్రిల్ 1 నుంచి UPI రూల్స్‌లోనూ కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం బ్యాంకులు, UPI సర్వీస్‌ ప్రొవైడర్‌లు ప్రతి వారం యూజర్ల మొబైల్‌ నంబర్లను అప్‌డేట్‌ చేయాలి. ఫలితంగా తప్పుడు లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు. అయితే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇతరులకు కేటాయించిన మొబైల్‌ నంబర్లు, ఇన్‌యాక్టివ్‌ నంబర్లకు ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి UPI సేవలు నిలిచిపోనున్నాయి. దీంతోపాటు యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఉన్న నగదును తిరిగి బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసుకొనే అవకాశం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. యూపీఐ లైట్‌ వినియోగానికి పిన్‌, పాస్‌కోడ్‌, బయోమెట్రిక్‌ వంటిని కలిగి ఉండాలి.

రివార్డ్‌ పాయింట్స్‌లో కోత :
SBI, IDFC ఫస్ట్‌ బ్యాంకు వంటి బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డుల రివార్డు పాయింట్స్‌లో కోత పెట్టనున్నాయి. టికెట్‌ వోచర్‌లు, ఇతర ప్రోత్సాహకాలను నిలిపివేయనున్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌.. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్‌ బుకింగ్‌లపై వచ్చే రివార్డ్స్‌ను కుదించింది. ఎయిరిండియాలో విస్తారా విలీనం నేపథ్యంలో విస్తారా క్రెడిట్ కార్డు రివార్డులను యాక్సెస్‌ బ్యాంకు సవరించింది. ఏప్రిల్‌ 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
New Rules from April 1 2025 on UPI, ATM users and tax payers in india in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X