నవంబర్‌లో కొత్త రూల్స్.. రైల్వే టికెట్ రిజర్వేషన్, క్రెడిట్ కార్డ్, UPI నిబంధనల్లో కీలక మార్పులు..!
నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు వచ్చాయి. రైల్వే టికెట్ల బుకింగ్, UPI నగదు బదిలీ పరిమితులు, క్రెడిట్ కార్డుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రైల్వే శాఖ పరంగా కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 31, 2024 వరకు రైలు టికెట్ లను 120 రోజుల గడువుతో బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉండేది. అయితే 2024 నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన (New Rules From November 1 2024) అమల్లోకి వచ్చింది. కేవలం 60 రోజుల వరకు మాత్రమే ప్రస్తుతం టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది.
గత నెలలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణాలను కూడా వెల్లడించింది. 120 రోజుల ముందు రైల్వే టికెట్ లను బుకింగ్ చేసుకుంటున్న వారిలో 21 శాతం మంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని IRCTC తెలిపింది. దీంతోపాటు మరో 5 శాతం వరకు.. టికెట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రయాణాలు చేయడం లేదని పేర్కొంది. దీంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ఈ తరహా సమస్యలకు పరిష్కారం చూపేందుకు రైల్వే టికెట్ రిజర్వేషన్ (Railway Ticket Advance Reservation) ముందస్తు బుకింగ్ గడువును 60 రోజులకు కుదించినట్లు తెలిపింది. దీంతోపాటు లగేజీ విషయంలోనూ రైల్వే అక్టోబర్ 31న కీలక ప్రకటన చేసింది. పరిమితికి మించి లగేజీ తీసుకువస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు ఉచిత లగేజీ విషయంలోనూ అనుమతించిన దాని కంటే ఎక్కువ తీసుకొస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
దీంతోపాటు UPI లావాదేవీలపైనా కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. UPI లైట్ నుంచి రూ.1000 వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. గతంలో రూ.500 వరకు పంపేందుకు మాత్రమే అవకాశం ఉండేది. SBI క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలను పెంచింది. 3.5 శాతంగా ఉన్న దాన్ని నవంబర్ 1 నుంచి 3.75 శాతానికి పెంచింది. దీంతోపాటు ఒక బిల్లింగ్ సైకిల్‌లో యుటిలిటీ పేమెంట్ లు రూ.50 వేలు దాటితే 1 శాతం సర్‌ఛార్జీ వసూలు చేయనుంది.
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతి నెల ఈ ధరలను ఆయా సంస్థలు సవరిస్తుంటాయి. నవంబర్ నెలలో వాణిజ్య సిలిండర్ ధరను పెంచుకూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ.62 పెంచాయి. కొత్త ధరలు నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. అయితే ఇళ్లళ్లో వినియోగించే 14.2 కేజీల గ్యాస్ సెలిండర్ ధరలో ఎటువంటి మార్పులు చేయలేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశీయ నగదు బదిలీ కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. దేశ ఆర్ధిక చట్టాలకు అనుగుణంగా లావాదేవీల భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్ అవుట్‌లెట్ లభ్యత, నగదు చెల్లింపుల వ్యవవ్థను మెరుగుపరచడం, KYC రూల్స్ ను సులభతరం చేయడం వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








