Home
News

అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. PAN కార్డు, సిమ్‌, బ్యాంకులు, పథకాల్లో కీలక మార్పులు..!!

భారత్‌లో అక్టోబర్ 1 నుంచి ఆధార్‌, పాన్‌ కార్డు సహా ఆదాయపన్ను చెల్లింపు నిబంధనల్లో కొన్ని మార్పులు రానున్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు చాలా మంది ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈ కొత్త రూల్స్‌ను అందరూ తెలుసుకోవడం ఉత్తమం. బ్యాంకులు, సుకన్య సమృద్ధి యోజన సహా ట్రాయ్‌ కొత్త నిబంధనలు కూడా రేపటి నుంచి అమల్లోకి (New Rules From October 1 2024) రానున్నాయి.

ITR మరియు PAN కార్డు : ఐటీఆర్‌ సమర్పించడం సహా పాన్‌ కార్డు కోసం ధరఖాస్తు చేసేందుకు గతంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ను సమర్పించినా అనుమతి ఇచ్చేవారు. అక్టోబర్‌ 1 నుంచి ఐటీఆర్‌, పాన్‌ కార్డు దరఖాస్తుదారులు కచ్చితంగా ఆధార్‌ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంది.

Pan card sim card and saving schemes new rules will effect from october 1 2024

సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు రానున్నాయి. ఈ పథకంలో భాగంగా కేవలం చట్టపరమైన సంరక్షకులు మాత్రమే కుమార్తెల ఖాతాలను నిర్వహించేందుకు అనుమతించనున్నారు. బయట వ్యక్తులు బాలికల పేరుతో ఖాతాలు తెరిచి ఉంటే అక్టోబర్‌ 1 నుంచి ఆ ఖాతాలను బాలిక తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఆ ఖాతాలు డియాక్టివేట్‌ కానున్నాయి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో యునైటెడ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఒరియంటల్‌ బ్యాంక్ ఆఫ్‌ కామర్స్‌ విలీనం అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా బ్యాంకులు జారీచేసిన చెక్‌ బుక్‌లను అనుమతించారు. అయితే అక్టోబర్‌ 1 నుంచి పంజాన్‌ నేషనల్‌ బ్యాంకు పేరుతో ఉన్న చెక్‌బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు డిమాండ్‌ డ్రాప్ట్‌, మినిమం బ్యాలెన్స్‌, చెక్‌లపై ఛార్జీలు విధించనున్నారు.

HDFC క్రెడిట్‌ కార్డు లాయల్టీ ప్రొగ్రాంలో మార్పులు చేసింది. రేపటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. HDFC బ్యాంక్ Smartbuy ప్లాట్‌ఫాంలో యాపిల్‌ ఉత్పత్తుల రివార్డ్‌ పాయింట్‌ల రిడిమ్‌ క్యాలెండర్‌ ట్రైమాసికంలో ఒక ఉత్పత్తికి మాత్రమే పరిమితం చేసింది.

అక్టోబర్ 1 నుంచి ట్రాయ్‌ కీలక మార్పులు చేయనుంది. 4G, 5G సేవల నాణ్యత మెరుగుపడనుంది. దీంతోపాటు నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు జరిమానా విధించనుంది. దీంతోపాటు SMS ల ద్వారా URL, APK ఫైల్స్‌ను యూజర్లకు పంపించకూడదు. దీంతోపాటు టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్ సమాచారాన్ని వారి వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.

అంటే మీ ప్రాంతంలో 5G అందుబాటులో ఉందో లేదా తెలుసుకొనేందుకు నేరుగా ఆ సంస్థల వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం టెలికాం సంస్థల వెబ్‌సైట్‌లో లోకేషన్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఈ వివరాలు తెలియనున్నాయి. దీంతోపాటు స్పామ్ కాల్స్‌ని నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
New rules from october 1 2024 in india pan card banks sim card and saving schemes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X