New Changes July 2025 : జులై 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. రైల్వే, PAN, బ్యాంకుల్లో కొత్త రూల్స్..!
New Changes July 2025 : ప్రతి నెల తరహాలోనే జులై నెలలోనే కొన్ని కీలక మార్పులు రానున్నాయి. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్, పాన్ కార్డు, వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల నిబంధనల్లో మార్పులు రానున్నాయి. దీంతోపాటు గ్యాస్ ధరల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ATM ఛార్జీల విషయంలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రైల్వేలో భారీ మార్పులు చూడనున్నారు.
పాన్ కార్డులు :
ఇప్పటి వరకు పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకొనేందుకు కొన్ని రకాల గుర్తింపు కార్డులతోపాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను అనుమతి ఉండేది. అయితే జులై నుంచి ఇందులో కీలక మార్పులను రానున్నాయి. జులై 1 నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే యూజర్లు కచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.

రైల్వే రూల్స్ :
జులై 1 నుంచి రైల్వే తత్కాల్ నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి. జులై 1 నుంచి ఆధార్ అథెంటికేషన్ చేసిన IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ యూజర్లు మాత్రం తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా జులై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP ద్వారా మాత్రమే టికెట్లను బుకింగ్ చేయాల్సి ఉంటుంది.
ఏజెంట్లకు కొత్త నిబంధనలు :
దీంతోపాటు AC తత్కాల్ టికెట్లను ఉదయం 10 గంటలకు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఏజెంట్లు మాత్రం 10:30 AM గంటలకు మాత్రమే బుకింగ్ చేసేందుకు అనుమతి ఉంటుంది. అదే నాన్ ఏసీ టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభం అవుతుంది. అదే ఏజెంట్లు మాత్రం 11:30 గంటల తర్వాతనే బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. ఏజెంట్లకు ఈ రూల్ జులై 15 నుంచి అమల్లోకి వస్తుంది.
HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు రూల్స్ :
జులై 1 నుంచి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ రూల్స్‌లో కీలక మార్పులు రానున్నాయి. రూ.10 వేల కంటే వాలెట్ లోడింగ్, రూ.50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులు, రూ.10 వేల కంటే ఎక్కువ ఆన్‌లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్లపై 1 శాతం ఛార్జీలను వసూలు చేయనుంది.
ICICI బ్యాంకు రూల్స్ :
ICICI బ్యాంకు సర్వీస్ ఛార్జీలు, ATM వినియోగ ఛార్జీల్లో మార్పులు రానున్నాయి. సొంత బ్యాంకుల ఏటీఎంల నుంచి 5 సార్లు ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అనంతరం ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో 3 సార్లు ఉచితం, అదే ఇతర ప్రాంతాల్లో 5 సార్లు వరకు ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
గ్యాస్ ధరలు :
సాధారణంగా ప్రతినెల ఒకటో తేదీన గ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా గృహ, వాణిజ్య సిలెండర్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని నెలల్లో ధరలు స్థిరంగా ఉండగా.. మరికొన్ని నెలల్లో ధరలు పెరగడం లేదా తగ్గడం వంటి అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications








