టెక్నాలజీ మరింత అభివృద్ది.. గుండె చప్పుడు పాస్‌వర్డ్‌గా

Posted By: Prashanth

టెక్నాలజీ మరింత అభివృద్ది.. గుండె చప్పుడు పాస్‌వర్డ్‌గా

 

టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది అనడానికి ఈ ఒక్క ఉదాహారణ చాలు. పరిశోధకులు ఓ సరిక్రొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ని డెవలప్ చేశారు. ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ సహాయంతో మనిషి యొక్క గుండెచప్పుడుని పాస్‌వర్డ్‌గా గుర్తిస్తుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ పరికరాలకు కూడా తాళం వేయబోతున్నారన్న మాట. ఏ ఒక్క మనిషి గుండె చప్పుడు కూడా కలవదు. ఎందుకంటే గుండె చప్పుడు అనేది అపూర్వమైనది.

చైనీస్ పరిశోధకులు ప్రయోగాత్మకంగా దీనిని పరిశీలించారు. తైవాన్‌లో ఉన్న నేషనల్ చుంగ్ హింగ్ విశ్వవిద్యాలయం పేర్కోన్న సమాచారం ప్రకారం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ సంకేతాలు ప్రతి వ్యక్తి మధ్య మారుతుంది మరియు వారు బయోమెట్రిక్ గుర్తింపు కోసం ఒక సాధనంగా ఉపయోగించవచ్చు.

ఈ పరిశోధన చున్ లియాంగ్ లిన్ నేతృత్వం వహించారు. వ్యక్తి అరచేతుల్లో నుండి తీసిన రెండు ఈసిజి రీడింగులను ఉపయోగించి మనిషి గుండెచప్పుడు యొక్క ప్రత్యేక గణిత గుణాలు తెలుసుకున్నారు. ఈ గుండె చప్పుడు సంఖ్య పాస్‌వర్డ్‌గా ఉపయోగించేందుకు గాను ఆమోద ముద్రని తెలిపారు. అంతేకాకుండా ఈ పాస్‌వర్డ్ వ్యవస్థ చాలా సురక్షితం ఉంటుంది. పూర్వ కాలంలో బయోమెట్రిక్ సెక్యూరిటీ సిస్టమ్స్‌ని ఉపయోగించి వేలిముద్రలు, ఛాయాచిత్రాలను తీసేవారని తెలియజేశారు.

లిన్ అంతిమ లక్ష్యంగా బాహ్య హార్డ్ డ్రైవ్ మరియు సమాన పరికరాల కోసం ఓ వ్యవస్దను నిర్మిచండమేనని అన్నారు. ఆ వ్యవస్ద ఎలా ఉండాలంటే వాటిని ముట్టుకోకుండా ఎన్‌క్రిప్ట్ లేదా డిక్రిప్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot