ప్రపంచాన్ని వణికిస్తున్న 14ఏళ్ల బాలుడి సరదా

By Gizbot Bureau
|

ఒక చిన్న మైనర్ కుర్రాడు సృష్టించిన మాల్వేర్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. సైబర్ నేరాలు అధికమైన ఈరోజుల్లో సమాచార దోపిడీ అత్యధిక కీలక పాత్ర పోషితోంది సులువుగా మన డేటా మొత్తం కొట్టేసే ఒక మాల్ వేర్ ను 14 ఏళ్ల కుర్రాడు సృష్టించాడు. దానిపేరే సైలెక్స్‌ మాల్ వేర్‌. ఈ కొత్త మాల్ వేర్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తుంది.

 
New Silex malware is bricking IoT devices, has scary plans

డేటా ఆధారంగా పనిచేసే ఐఓటీ వస్తువులే లక్ష్యంగా.. మోడెమ్‌లు, స్మార్ట్‌ టీవీలు-ఫోన్లు, ట్యాబ్లెట్లు, మల్టీమీడియా ప్లేయర్లు, ఏఆర్‌ఎం ప్రాసెసర్లను పని చేయకుండా ఈ మాల్ వేర్ ని సృష్టించారు.ఐరోపాకు చెందిన 14 ఏళ్ల బాలుడు మరో ఇద్దరు మిత్రులతో కలసి ఈ మాల్ వేర్ ను సృష్టించాడు. ఈ బాలుడు ఐరోపాలో కూర్చుని మాల్ వేర్ ను విస్తరింపజేస్తూ.. ఇరాన్‌లో ఉండే సర్వర్ల నుంచి వైరస్‌ విస్తరిస్తున్నట్లు నమ్మేలా చేస్తున్నాడు.

 బ్రికర్‌బాట్‌ తో సమానం

బ్రికర్‌బాట్‌ తో సమానం

2017లో ‘ఎంటీఎన్‌ఎల్‌' బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు స్తంభించి, ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు ఆగిపోవడానికి కారణమైన ‘‘బ్రికర్‌బాట్‌'' అనే మాల్‌వేర్‌ తరహాలో ఇది పని చేస్తుంది. బ్రికర్‌బాట్‌ కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 60 వేల మోడెమ్‌లు అప్పట్లో పనికిరాకుండా పోయాయి.

 పూర్తిగా పనిచేయవు

పూర్తిగా పనిచేయవు

డీఫాల్ట్‌ లాగిన్‌ వివరాలతో యూనిక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ మాల్‌వేర్‌ పనిచేస్తోంది. ‘ఏఆర్‌ఎం' ఆధారిత డీవీఆర్‌ లేదా 64 బిట్‌ సిస్టమ్ లు కూడా ఈ మాల్ వేర్ దెబ్బకు ఆగలేవు. సింపుల్ పాస్ వర్డ్ లు ఉండే ఐఓటీ వస్తువుల స్టోరేజీలోకి మొదట మాల్‌ వేర్‌ ప్రవేశిస్తుంది. నెట్‌వర్క్‌ కాన్ఫిగరేషన్స్‌ను తీసేసి యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను పనికిరాకుండా చేస్తుంది. చివరగా వస్తువును పూర్తిగా పనిచేయకుండా చేస్తుంది.

 12345 తరహా పాస్‌వర్డులు
 

12345 తరహా పాస్‌వర్డులు

అయితే ప్రపంచంలో ఉపయోగిస్తున్న వస్తువుల్లో 15 శాతం వాటికి డీఫాల్ట్‌ పాస్‌వర్డులు, సులువుగా ఊహించే 12345 తరహా పాస్‌వర్డులు పెడుతున్నారు. ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని సైలెక్స్‌ పని చేస్తోంది. డీఫాల్ట్‌ పాస్‌వర్డులు లేనివాటిపై దీని ప్రభావం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

వెంటనే పాస్‌వర్డులు మార్చుకోవాలి

వెంటనే పాస్‌వర్డులు మార్చుకోవాలి

అందుకే వెంటనే పాస్‌వర్డులు మార్చుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీ స్మార్ట్‌ఫోన్‌-టీవీ, మోడెమ్‌లు పని చేయకపోతే వాటిని పనికిరానివని పాడేయనక్కర్లేదు. కొత్తవి కొనక్కర్లేదు. సంబంధిత కంపెనీకి చెందిన ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌ కోసం ఆ ఉపకరణంపై ఉన్న వివరాలు పరిశీలించి, సంప్రదించండి.

ఎలా వెలుగులోకి వచ్చిందంటే...

ఎలా వెలుగులోకి వచ్చిందంటే...

అకమాయి సెక్యూరిటీ నిఘా ప్రతిస్పందన బృందం పరిశోధకుడు లారీ క్యాష్‌డాలర్‌ తొలిసారిగా ఈ విధ్వంసకరమైన మాల్‌వేర్‌ గురించి వెలుగులోకి తెచ్చారని జెడ్‌నెట్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ తెలిపింది. డీఫాల్ట్‌ లాగిన్‌ వివరాలతో కూడిన యూనిక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ మాల్‌వేర్‌ పనిచేస్తోందని లారీ చెబుతున్నారు. ‘ఏఆర్‌ఎం' ఆధారిత డీవీఆర్‌ లేదా 64 బిట్‌ సిస్టమ్‌ అయినా దీని ధాటికి ఆగలేవంటున్నారు.

 సరదా కోసం విధ్వంసం

సరదా కోసం విధ్వంసం

‘న్యూస్కై సెక్యూరిటీ రీసెర్చ్‌'కు చెందిన అంకిత్‌ అనుభవ్‌ కథనం ప్రకారం సైలెక్స్‌ను ముగ్గురు మిత్రులు సృష్టించారు. లైట్‌ లీఫన్‌ అనే రహస్యపేరు (సూడోనేమ్‌) పెట్టుకున్న 14 ఏళ్ల బాలుడు వీరికి నాయకుడు. స్కిడ్డీ అనే తన మిత్రుడితో కలసి బ్రికర్‌బాట్‌ను స్ఫూర్తిగా తీసుకుని సైలెక్స్‌ను సృష్టించినట్లు లీఫన్‌ వెల్లడించాడు. దీన్ని మరింత అభివృద్ధి పరిచి, భవిష్యత్తులో ప్రతి సాంకేతిక ఉపకరణాన్ని ప్రభావితం చేసేలా సైలెక్స్‌ను అభివృద్ధి చేస్తున్నానని చెప్పాడు. మొదట ఈ పనిని సరదాగా ప్రారంభించామని, ఇప్పుడు దీనిపైనే ఫుల్‌టైమ్‌ ప్రాజెక్టు వర్కు చేస్తున్నానని ఈ బాలుడు వెల్లడించాడు.

Best Mobiles in India

English summary
New Silex malware is bricking IoT devices, has scary plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X