Home
News

సిమ్‌ కార్డుల ద్వారా నేరాలు చేస్తే మూడు సంవత్సరాల వరకు కొత్త సిమ్‌ కార్డు తీసుకోలేరు..!

సైబర్‌ క్రైం నేరాలకు సిమ్ కార్డులు కూడా ముఖ్య కారణంగా ఫేక్‌ కాల్స్‌, ఫేక్ మెసేజ్‌ ల ద్వారా నేరగాళ్లు అనేక మందిని మోసం చేస్తున్నారు. ఇందుకోసం టెలికాం శాఖ, ట్రాయ్‌ చర్యలు తీసుకుంటోంది. అయితే కొత్త సంవత్సరం నుంచి సిమ్ కార్డు నిబంధనలను మరింత కఠినతరం కానున్నాయి. ఫలితంగా ఇష్టానుసారం సిమ్‌ కార్డులను కొనుగోలు చేసి, దుర్వినియోగానికి పాల్పడే వారిని అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా ఘటనలకు పాల్పడే వారు గరిష్ఠంగా 3 సంవత్సరాలపాటు సిమ్‌ కార్డులు కొనుగోలు చేయకుండా (New Sim Card Rules) నిషేధం విధించనుంది.

సిమ్‌ కార్డులతో సైబర్ మోసాలు :
దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్‌ యూజర్లు సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ఇప్పటికే సిమ్‌ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల చర్యలు తీసుకుంటున్న టెలికాం శాఖ.. కొత్తగా మరిన్ని నిబంధనలను తీసుకురానుంది. ఇప్పటికే సిమ్‌ కార్డు రూల్స్‌ను అమలు చేస్తోంది. ఫలితంగా వేల సిమ్‌ కార్డులు డియాక్టివేట్‌ కానున్నాయి.

New sim card rule

మోసాలకు పాల్పడే వారి పేర్లతో బ్లాక్‌ లిస్ట్‌ :
కొత్తగా టెలికాం శాఖ తీసుకొస్తున్న నిబంధనలతో ఇతరుల పేరు మీద సిమ్‌ కార్డులు తీసుకొని మోసపూరిత కార్యకలాపాల కోసం వినియోగించే వ్యక్తులు ఇక నుంచి టార్గెట్‌ కానున్నారు. ఇలాంటి వారితో కూడిన జాబితాను రూపొందించనున్నారు. సైబర్‌ సెక్యూరిటీ రూల్స్‌ ప్రకారం ప్రత్యేక రిపోజిటరీని తయారు చేస్తారు.

కొందరికి నోటీసులు జారీ చేస్తారు :
ఈ జాబితాను టెలికాం ఆపరేటర్ల కు అందించి, వారు కొత్తగా సిమ్‌ కార్డులు కొనుగోలు చేయకుండా నిషేధం విధించనున్నారు. ఈ సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. అయితే చర్యలు తీసుకొనే ముందు ఈ జాబితాలోని వ్యక్తులు నోటీసులు జారీచేయనున్నారు.

నోటీసులు లేకుండానే బ్లాక్‌ చేస్తారు :
నోటీసులు అందుకున్న వారు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు కొత్త సిమ్‌ కార్డులు కొనుగోలు చేసే అవకాశం ఉండదు.

గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు బ్లాక్ చేస్తారు :
సిమ్‌ కార్డులతో సైబర్‌ మోసాలకు పాల్పడే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కొత్త కనెక్షన్‌ తీసుకొనే ఛాన్స్‌ లేకుండా బ్లాక్‌ చేస్తారు. సిమ్‌ కార్డు ఆధారిత నేరాలను అడ్డుకోవడం మరియు ప్రజల్లో టెలికాం సర్వీసులపై నమ్మకాన్ని క్రియేట్‌ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కీలక చర్యలు తీసుకుంటోంది. స్పామ్‌ కాల్స్‌, స్పామ్ మెసేజ్‌లను అడ్డుకొనేందుకు ప్రతి టెలికాం ఆపరేటర్‌ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతోపాటు ఇటీవల సైబర్‌ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర హోంశాఖ కీలక చర్యలు తీసుకుంది. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాలర్‌ ట్యూన్స్‌ను ప్రచారంలోకి తీసుకొచ్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
New sim card rules criminals restricted from obtaining new connection upto 3 years
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X