మొబైల్ యూజర్లకు ఇక హ్యాపీ..హ్యాపీ!

Posted By: Super

మొబైల్ యూజర్లకు ఇక హ్యాపీ..హ్యాపీ!

 

న్యూఢిల్లీ : టెలికం రంగంలో పారదర్శకతతో పాటు వృద్ధి స్థాయిని పెంపొందించేందుకు దశాబ్దం నాటి పాటి నిబంధనలకు స్వస్తి పలుకుతూ, కొత్త విధానాలతో రూపుదిద్దుకున్న జాతీయ టెలికాం విదానం 2012 (ఎన్‌టీపీ)ని గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ విధానాల సారాంశాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే... ఇక పై దేశ వ్యాప్తంగా మొబైల్ రోమింగ్ చార్జీలు రద్దుకానున్నాయి. అదేవిధంగా, పదే పదే మొబైల్ నంబరు పోర్టబిటిటీ చార్జాల సమస్య లేకుండా దేశమంతతా ఒకే నంబరును ఉపయోగించుకోవచ్చు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) వల్ల మొబైల్ యూజర్లు.. సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చినప్పటికీ, పాత నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు లభిస్తుంది. కేవలం టెలికం సర్కిల్ స్థాయికే పరిమితమైన ఈ సదుపాయం ఇకపై దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే, ఇందుకోసం యూజర్లు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. కొత్త అంశాలన్నింటినీ అమల్లోకి తెచ్చేందుకు సంబంధించిన విధివిధానాలపై టెలికం విభాగం (డాట్) కసరత్తు ప్రారంభించనుంది. దేశంలో పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ), దేశమంతటా ఫ్రీ రోమింగ్‌ను అమలు చేయాలన్న లక్ష్యం వైపుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌టీపీకి ఆమోదముద్ర వేసిన తర్వాత టెలికం మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot