వివో X20 బ్లాక్ అండ్ గోల్ట్ వేరియంట్ రిలీజ్!

Posted By: Madhavi Lagishetty

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో...గత నెలలో,వివో X20, X20 ప్లస్ ఫోన్లను చైనాలో రిలీజ్ చేసింది. మిడ్ రేంజర్ వివో X20 యూజర్లను అట్రాక్ట్ చేసే ఎన్నో ఫీచర్లు, మరెన్నో స్పెసిఫికేషన్స్ తో మార్కెట్లోకి రానుంది.

వివో X20 బ్లాక్ అండ్ గోల్ట్ వేరియంట్ రిలీజ్!

వివో స్వదేశంలో ఒక కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్ను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా ప్రకటించింది. ఈ న్యూ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో వస్తుంది. 3398 యువాన్ ( రూ. 33,500)లకు అందుబాటులో ఉండనుంది. X20 కంటే సుమారు 300 యువాన్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. గోల్డ్, రోజ్ గోల్డ్ మరియు మాట్ట్ బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్లో ఉంటుంది. కొన్ని ఎలిమెంట్స్ మాత్రం గోల్డ్ కలర్లో ఉంటాయి. ఫోన్ బ్యాక్ సైడ్ ఫ్యానెల్లో వివో బ్రాండింగ్, కెమెరా సెటప్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ గోల్ట్ కలర్లో అందంగా తీర్చిదిద్దబడ్డాయి.

వివో X20 బ్లాక్ అండ్ గోల్ట్ వేరియంట్ రిలీజ్!

ఇక స్పెసిఫికేషన్స్ యూజర్లను మెస్మరైజ్ చేస్తాయి....కొత్త మోడల్ వివో X20 మాదిరిగానే ఉంటుంది. 2160 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తోపాటు 18:9 ఆస్పెక్స్ రేషియోలో ఉంటుంది. 6.01అంగుళాల FHD+సూపర్ ఆల్మోడ్ డిస్ప్లేను అందిస్తుంది. డిస్ల్పే 2.5డి క్వర్డ్ గ్లాస్ తో పొటెక్ట్ చేయబడి ఉంటుంది.

అడెర్నో 512గ్రాఫిక్స్, 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజి కెపాసిటి కలిగిన ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 660 SoC ద్వారా శక్తినిస్తుంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా 256జిబి వరకు స్టోరేజి స్పేస్ను ఎక్స్ పాండ్ చేసుకునే వీలుంటుంది.

టెక్ దిగ్గజాల కోట్ల ఆదాయం వెనుక అన్నీ రక్తపు మరకలే, ఎవ్వరికీ తెలియని నిజాలు..

ఆప్టిక్స్ చూసినట్లయితే...ఈ డివైస్ 12మెగాపిక్సెల్ + 5మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్తో వస్తుంది. OIS,f/1.8ఎపర్చరుతోపాటు LED ఫ్లాష్ ఉంటుంది. ఫ్రంట్ f/2.0ఎపర్చర్, సాఫ్ట్ LEDఫ్లాష్తో 12మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

వివో X20చే అందించబడిన కనెక్టివిటీ ఫీచర్లు 4జి వోల్ట్, బ్లూటూత్ 5.0, జిపిఎస్ మరియు డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. డివైస్ బ్యాటరీ కెపాసిటి 3,245ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది.

Via

Read more about:
English summary
The Vivo X20 features a 12MP+5MP rear dual camera setup.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot