ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 12.5 (2019)ను విడుదల చేసిన షియోమి
గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో ఏదో ఓ కొత్త ఉత్పత్తిని వినియోగదారుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. ఈ ఊపులోనే షియోమి తన న్యూ సీరిస్ all-new Mi Notebook Airని మార్క
గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో ఏదో ఓ కొత్త ఉత్పత్తిని వినియోగదారుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. ఈ ఊపులోనే షియోమి తన న్యూ సీరిస్ all-new Mi Notebook Airని మార్కెట్లో ప్రవేశపెట్టింది. 12.5 అంగుళాల 4జీబీ ర్యామ్ గల ఎంఐ నోట్‌బుక్ ఎయిర్‌ను చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఎంఐ నోట్‌బుక్ రెండు రంగుల్లో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. మార్చి 28 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

ఎంఐ నోట్‌బుక్ ప్రారంభ ధర రూ.37,000 ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఇండియాకి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

ఫీచర్లు
ఇందులో 12.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఎం3/ కోర్ ఐ5 ప్రాసెసర్, 128/256 జీబీ ఎస్ఎస్‌డీ, ఫాస్ట్ చార్జింగ్, డీటీఎస్ సౌండ్, 4జీబీ ర్యామ్, యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎంఐ, విండోస్ 10 హోం ఎడిషన్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

హైలెట్స్
Mi Notebook Air రెండు వేరియంట్లలో వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన Intel's 8th generation M3 మీద బేసిక్ మోడల్ పనిచేస్తుంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ i5 processor మీద రన్ అవుతుంది.

గతేడాది లాంచ్ చేసిన ల్యాపీకి భిన్నంగా
కాగా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన Mi Notebook Air గతేడాది లాంచ్ అయిన దానికి సరికొత్త ఫీచర్లను జోడించుకుని వచ్చింది. Mi Notebook Air 12.5 M3 processor 4జిబి ర్యామ్ తో పాటు 128 జిబి స్టోరేజ్ తో వచ్చింది. అలాగే 256GB storageతో పాటు 4 GB of RAMతో మరో వేరియంట్ రిలీజ్ అయింది.

ప్రత్యేకతలు
ఎంఐ నోట్‌బుక్ ఎయిర్‌లో అల్యూమినియం బాడీ, సన్నని బెజెల్ డిజైన్, గ్లాస్ ట్రాక్‌ప్యాడ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కాగా Mi.com, JD.com వెబ్‌సైట్లలో 100 యువాన్లకు ప్రీ-సేల్ మొదలైంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.07 కిలోలు.


Click it and Unblock the Notifications








