Home
News

New Year 2025 జనవరి 1 నుంచి ఏయో మార్పులు రానున్నాయో తెలుసా..?

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరానికి అడుగుపెట్టబోతున్నాం. అయితే జనవరి 1 నుంచి అనేక మార్పులు (New Changes From January 1st 2025) చోటు చేసుకోనున్నాయి. వాట్సాప్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, గ్రామీణ బ్యాంకులు, యూపీఐ, LPG గ్యాస్‌ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు చాలా మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జనవరి 1 వ తేదీ నుంచే కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో కీలక మార్పులు :
ప్రముఖ OTT ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video OTT) ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఒకే అకౌంట్‌లో లాగిన్‌ అయ్యే డివైజ్‌లపై పరిమితి విధించింది. ప్రస్తుతం ఒకే అకౌంట్‌తో స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ట్యాబ్లెట్‌లను కనెక్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. గరిష్ఠంగా 10 డివైజ్‌లను కనెక్ట్‌ చేసుకొని వినియోగించుకోవచ్చు.

New year 2025 New changes from january 1st in india here are the details

అయితే జనవరి 2025 నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒకే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అకౌంట్‌తో రెండు టీవీలతో సహా గరిష్ఠంగా 5 డివైజ్‌లను మాత్రమే కనెక్ట్‌ చేసుకొనేందుకు వీలుంది. ఈ కొత్త నిర్ణయంపై యూజర్లకు సమాచారం అందిస్తున్నట్లు గత వారం అమెజాన్‌ వెల్లడించింది. సెట్టింగ్స్‌ పేజీ ద్వారా మార్పులు చేసుకొనేందుకు అవకాశం ఉందని తెలిపింది.

జనవరి నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు :
వాట్సాప్‌ కూడా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ OS తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ సపోర్టును నిలిపివేయనున్నట్లు (Whatsapp to End Support to Old Smartphones) వెల్లడించింది. జనవరి 1 వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S3, గెలాక్సీ Ace 3, గెలాక్సీ నోట్‌ 2, గెలాక్సీ S4 మిని, సోనీ ఎక్స్‌పీరియా Z, ఎక్స్‌పీరియా SP, ఎక్స్‌పీరియా T, ఎక్స్‌పీరియా V, మోటో G (1st జెన్‌), Razr HD, మోటో E 2014, LG ఆప్టిమస్‌ G, నెక్సాస్‌ 4, G2 మిని, L90, , HTC వన్‌ X, వన్‌ X ప్లస్‌, డిజైర్‌ 500, డిజైర్‌ 601 వంటి ఫోన్‌లు ఉన్నాయి.

యూపీఐ పరిమితి పెంపు! :
వీటితోపాటు జనవరి 2025 నుంచి ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ అవసరం కూడా లేకుండా యూపీఐ సర్వీసులను అందించేందుకు తీసుకొచ్చిన UPI123PAY పరిమితి పెరగనుంది. ఫీచర్‌ ఫోన్ల కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. అయితే జనవరి నుంచి దీని ద్వారా గరిష్ఠంగా రూ.10,000 వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి నెల LPG గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయా సంస్థలను నిర్ణయిస్తుంటాయి. 2024 సంవత్సరాల్లో కొన్ని నెలల్లో ధరలు స్థిరంగా ఉండగా.. మరికొన్ని నెలల్లో ధరలు పెరిగాయి. ఈ సంవత్సరం వ్యాణిజ్య సిలిండర్‌ ధరల్లో కొన్నిసార్లు మార్పులు వచ్చాయి. ఇంట్లో వినియోగించే సిలిండర్ ధరల్లో మార్పులు రాలేదు. అయితే జనవరిలో ధరల్లో ఎలాంటి రానున్నాయో చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
New year 2025 New changes from january 1st in india here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X