2013కు బైబై చెబుతూ గూగుల్ డూడుల్

Posted By:

డిసెంబర్ వచ్చిందంటే చాలు.. క్రిస్‌మస్, న్యూ ఇయర్ అంటూ సెలవులు. ఈ హ్యాపీ హ్యీపీ హాలీడేస్‌ను దృష్టిలో పెట్టుకోని సెర్చ్ ఇంజన్ గూగుల్ తమ యూజర్లను ఆశ్చర్యంలో ముంచెత్తెందుకు గాను ఏర్పాటు చేస్తున్న డూడుల్స్ నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి.

2013కు బైబై చెబుతూ గూగుల్ డూడుల్

2013కు బైబై చెబుతూ, అదే విధంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెర్చ్ ఇంజన్జెయింట్ డిసెంబర్ 31న పోస్ట్ చేసిన హ్యాపీ న్యూ ఇయర్ డూడుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గూగుల్ డూడుల్ పేరుతో ప్రత్యేకమైన సంస్కృతికి గూగుల్ ఇదువరుకే తెర లేపింది. ప్రముఖులకు సంబంధించి ప్రత్యేక దినాలను పురస్కరించుకుని వారి విశిష్టతను గుర్తుచేస్తూ హోమ్‌పేజీ పై ప్రత్యేక డూడుల్స్‌ను గూగుల్ ప్రవేశపెట్టడాన్ని గతకొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం.

ఒలంపిక్స్‌తో ప్రత్యేక అనుబంధం!

ఒలంపిక్ డూడుల్ సంస్కృతికి గూగుల్, సిడ్నీ ఒలంపిక్స్ 2000 నుంచి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత నుంచి నిర్వహిస్తూ వస్తున్న 2002 వింటర్ ఒలంపిక్స్ (సాల్ట్ లేక్ సిటీ యూఎస్ఏ), 2004 అథెన్ ఒలంపిక్స్, 2006 టోరినో వింటర్ ఒలంపిక్స్, 2008 బీజింగ్ ఒలంపిక్స్, 2010 వాన్కోవర్ వింటర్ ఒలంపిక్స్, 2012 లండన్ ఒలంపిక్స్ వరకు గూగుల్ ఈ డూడుల్ సంస్కృతిని మరింత పటిష్టం చేస్తూ వస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot