‘ట్విట్టర్‌లో ఎక్కువ సేపు గడుపితే ఆరోగ్యానికే ముప్పు’!

Posted By:

news (shiva)  Too much tweeting bad for health, says Twitter’s creative director

 

వాషింగ్టన్: సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ట్విట్టర్‌లో సందేశాలు (ట్వీట్లు) పంపుతూ గంటల తరబడి గడపడం అనారోగ్యకర పరిణామమని ఆ సైట్ సహ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డెరైక్టర్ బిజ్ స్టోన్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌కు దాదాపు 50 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, వారు గంటల తరబడి ట్వీట్లు పంపుతూనే గడపడం మంచిది కాదని ఆయన అన్నారు. అదేపనిగా సైట్‌పై గడపడం కాకుండా సైట్‌ను తరచూ సందర్శిస్తేనే బాగుంటుందని సూచించారు. కావల్సిన సమాచారం కోసం కాకుండా ఇంకా దేనికోసమో వెతుకుతూ సైట్‌పై ఎక్కువ సమయం గడపరాదని మాంట్రియెల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన అన్నారు.

ట్విట్టర్‌ను సందర్శించడం వ్యసనంగా మారిందని, కొంతమంది ఏకంగా 12 గంటలపాటు నిర్విరామంగా ట్వీట్లు పంపుకొంటున్నారని తమకు సమాచారం అందిందని బిజ్ తెలిపారు. తాము ట్విట్టర్‌ను ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది కాదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడం లేదా ఏదైనా నేర్చుకునేందుకే ట్విట్టర్‌ను ఉపయోగించాలని, ఎక్కువ సమయం కాకుండా తరచూ సైట్‌ను సందర్శించాలని యూజర్లను కోరారు. అదేవిధంగా ట్విట్టర్‌లో 140 క్యారెక్టర్ల పరిమితిని పెంచే ఆలోచనేదీ లేదన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot