Home
News

ఫాస్టాగ్‌ KYCను పూర్తి చేసేందుకు నేడే ఆఖరి ఛాన్స్‌.. రేపటి నుంచి ఏం జరగనుందో తెలుసా??

ఫాస్టాగ్‌ KYCను పూర్తి చేసేందుకు నేషనల్‌ హైవేస్‌ ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. ఈ గడువు జనవరి 31వ తేదీతోనే ముగిసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించింది. ఈ తేదీ లోపల KYC అప్‌డేట్‌ చేసుకోవాలని లేకుంటే మార్చి 1 తర్వాత ఫాస్టాగ్‌ ఖాతాలను డియాక్టివేట్‌ చేస్తామని NHAI ప్రకటన చేసింది.

రేపటి నుంచి ఖాతాల డియాక్టివేట్‌.. ? : 'వన్‌ వెహికల్‌.. వన్‌ ఫాస్టాగ్‌' (One vehicle- One Fastag) కార్యక్రమంలో భాగంగా ఫాస్టాగ్‌ (FASTAG KYC Update) కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది. గడువు లోగా పూర్తిచేయకుండా.. ఫాస్టాగ్‌ ఖాతాల్లో నగదు ఉన్నాగానీ డియాక్టివేట్‌ చేస్తామని తెలిపింది.

NHAI Deadline Ends today to Update FASTAG KYC

FASTAG KYC అప్‌డేట్‌ చేసేందుకు ఏయే పత్రాలు కావాలంటే : అయితే ఫాస్టాగ్‌ KYCను అప్‌డేట్‌ అయిందా లేదా లేకుంటే KYCని పూర్తిచేసేందుకు.. వాహనదారుడి గుర్తింపు కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (RC), పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, చిరునామాకు సంబంధించిన పత్రాలు అందుబాటులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులోని వివరాలను అప్‌డేట్‌ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌ను ఎలా అప్‌డేట్‌ చేయాలి.

స్టెప్‌ 1 : జాతీయ రహదారుల సంస్థకు చెందిన IHMCL సంస్థ వెబ్‌ సైట్‌లో లాగిన్‌ కావాలి. అందులో మై ప్రోఫైల్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అందులో KYC దగ్గర క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : KYC సెక్షన్‌లోని కస్టమర్‌ టైప్‌ను సెలెక్ట్ చేసి ఆప్షన్‌లోకి వెళ్లండి.
స్టెప్‌ 4 : అక్కడ అడిగిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

స్టెప్‌ 5 : అనంతరం వెబ్‌ సైట్‌లో నిబంధనలకు అనుగుణంగా పాస్‌ ఫోర్ట్‌ సైజు ఫోటోను అప్‌లోడ్‌ చేయండి.
స్టెప్‌ 6 : అనంతరం అడ్రస్‌ను నమోదుచేసి, అప్పటి వరకు మీరు నమోదు చేసిన వివరాలను తనిఖీ చేసుకోండి.
స్టెప్‌ 7: వివరాల తనికీ అనంతరం సమర్పించు పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

జాతీయ రహదారులపై టోల్‌ గేట్లను ఏర్పాటుచేసి.. టోల్‌ రుసుంను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. కొన్ని సంవత్సరాలపాటు నేరుగానే చెల్లింపులు నిర్వహించింది. అనంతరం ఈ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద FASTAG వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2021లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
NHAI Deadline Ends today to Update FASTAG KYC here are the steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X