Home
News

అదృష్టం అంటే ఇదే ! Google Pay లో 1 లక్ష రూపాయలు రివార్డ్ గెలుచుకున్నాడు.    

By Maheswara

గూగుల్ పే లో నగదు బదిలీ చేసాక అందులో వచ్చే రూ.10, రూ.50, రూ.100 లాంటి రివార్డులను చూసి మనం సంతోష పడుతుంటాము. కానీ గూగుల్ పే లో 1 లక్ష రూపాయల వరకూ కూడా ఈ రివార్డులు పొందే వీలుందని మీకు తెలిసిన విషయమే.కానీ ఈ విషయం అంత బూటకమని మీరు కొట్టి పారేయవచ్చు. కానీ, ఎవరైనా లక్ష రూపాయలు రివార్డ్ గా పొందితే ఇక అది నమ్మక తప్పదు.సరిగ్గా ఇలాంటి సంఘటనే మన తెలంగాణాలో జరిగింది.వివరాలు చూద్దాం రండి.

రివార్డ్ స్క్రాచ్ కార్డులు

రివార్డ్ స్క్రాచ్ కార్డులు

ప్రముఖ ఆన్ లైన్  నగదు చెల్లింపుల యాప్ గూగుల్ పే ‌లో డబ్బులు పంపిన వారంతా తరవాత వచ్చే రివార్డ్ స్క్రాచ్ కార్డులను చూస్తుంటారు. కానీ, చాలా మందికి బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అనే వస్తుంటుంది. మరికొంత మందికి అందులో వచ్చే పదీ ఇరవై రూపాయలు వస్తే చాలు సంతోషపడుతుంటారు.కానీ అదే లక్ష రూపాలు వస్తే ఇక వారి  సంతోషానికి హద్దులు ఉండవు. ఇలా అతి కొద్ది సందర్బాల్లో మాత్రమే జరుగుతుంటుంది.నిజమాబాద్ నగరానికి చెందిన నాగమల్లు సంపత్  అనే యువకుడికి కూడా ఇదే అదృష్టం కలిసివచ్చింది.

ఎప్పటిలాగానే

ఎప్పటిలాగానే

సంపత్ ఎప్పటిలాగానే గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేసి రివార్డ్ కోసం వచ్చిన స్క్రాచ్ కార్డు ను గీసి చూడగా అందులో అక్షరాలా లక్ష రూపాయలు రివార్డు పొందినట్లు సూచించింది.దీనితో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మొదట ఈ విషయాన్ని తానే నమ్మలేక పోయాడు.తర్వాత నెమ్మదిగా పరిశీలిస్తే ఈ రివార్డ్ నిజమేనని గ్రహించాడు.

Image source: V6 news

గూగుల్ పే బిజినెస్ అప్

గూగుల్ పే బిజినెస్ అప్

సంపత్ నిజామాబాద్ నగరంలో ఖలీల్ వాడీ లో కిరానా షాప్ నడుపుతుంటాడు.తన దుకాణానికి వచ్చే వినియోగదారులకు వారి ద్వారా వచ్చే నగదు బదిలీలను చూడడానికి గూగుల్ పే బిజినెస్ అప్ ను సంపత్ వాడుతున్నట్లు తెలిపాడు. గతం లో చిన్న చిన్న మొత్తాలలో రివార్డ్ లను చూసిన సంపత్ ఒకేసారి లక్షరూపాయలు మొత్తం రివార్డ్ గా రావడంతో సంతోషంతో ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులకు మరియు తోటి స్నేహితులకు ,చుట్టూ పక్కల వారికి తెలియచేసాడు.ఇలాంటి అదృష్టం అందరికి రాదు కనుక చుట్టుపక్కల వారు సంపత్ కు సన్మానం చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Best Mobiles in India

English summary
Nizamabad Youth Receives 1 Lakh Rupees As Reward In Google Pay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X