నోకియాని మైక్రోసాప్ట్ స్వాధీనం చేసుకోవడం లేదు, అదంతా రూమర్

Posted By: Staff

నోకియాని మైక్రోసాప్ట్ స్వాధీనం చేసుకోవడం లేదు, అదంతా రూమర్

లాస్ ఏంజిల్స్: నోకియా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్శంతా సంతోషించాల్సిన సమయం. గతంలో నోకియా కంపెనీని టెక్నాలజీ గెయింట్ అయిన మైక్రోసాప్ట్ స్వాధీనం చేసుకోనుందన్న వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తపై నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ డి9 కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నోకియాని మైక్రోసాప్ట్ స్వాదీనం చేసుకోనుందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్ని సుద్ద అబద్దం అని అన్నారు. ఇప్పటివరకు నోకియా, మైక్రోసాప్ట్‌ల మద్య అటువంటి డిస్కషన్ రాలేదు. కాకపోతే బిజినెస్ వ్యవహారాల కోసం రాబోయే కాలంలో నోకియా కంపెనీ విడుదల చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్‌‌లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడడం గురించి మాత్రమే చర్చిండం జరిగిందని తెలియజేశారు.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద మొబైల్ తయారీ సంస్ద నోకియాని మైక్రోసాప్ట్ టేక్ ఓవర్ చేయనుందన్న వార్తపై సిఈవో స్టీఫెన్ ఎలాప్ సెప్టెంబర్ 2010లో జరిగిన ట్రోజాన్ హార్స్ థీరీతో సంబోధించడం జరిగింది. ఇది ఇలా ఉండగా పోయిన వారం చాలా టెక్నాలజీ బ్లాగ్స్ మైక్రోసాప్ట్ కంపెనీ, నోకియాని $19 మిలియన్లకు స్వాధీనం చేసుకోబోతుందని వార్తలు వ్రాయడం జరిగింది. దీంతో మార్కెట్‌లో నోకియా షేర్స్ ఒక్కసారిగా పతనం కావడం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2011న జరిగిన నోకియా, మైక్రోసాప్ట్ బోర్డ్ మీటింగ్‌లలో రాబోయే కాలంలో నోకియా తయారు చేసేటుటవంటి స్మార్ట్ పోన్స్‌లలో మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7 ఫ్లాట్ ఫామ్‌ని ఉపయోగించడానికి అంగీకరించడం జరిగింది. మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7 ఫ్లాట్ ఫామ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి నోకియా స్మార్ట్ ఫోన్స్ 2012లో మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot